Read more!

English | Telugu

ఆస్కార్ విన్న‌ర్స్ ఫుల్ లిస్ట్‌.. బెస్ట్ పిక్చ‌ర్ 'నోమాడ్‌ల్యాండ్‌'

 

లేడీ డైరెక్ట‌ర్ క్లో జావో రూపొందించిన 'నోమాడ్‌ల్యాండ్' బెస్ట్ పిక్చ‌ర్‌గా ఆస్కార్ అవార్డును గెలుచుకోగా, 'ద ఫాద‌ర్‌'లో టైటిల్ రోల్ పోషించిన ఆంథోనీ హాప్‌కిన్స్ బెస్ట్ యాక్ట‌ర్‌గా, 'నోమాడ్‌ల్యాండ్‌'లో ప్ర‌ధాన పాత్ర‌ధారి ఫ్రాన్సెస్ మెక్‌డోర్మండ్ బెస్ట్ యాక్ట్రెస్‌గా అవార్డులు అందుకున్నారు. అమెరికా కాల‌మానం ప్ర‌కారం ఆదివారం రాత్రి (భార‌త కాల‌మానం ప్ర‌కారం సోమ‌వారం ఉద‌యం) జ‌రిగిన ఆస్కార్ అవార్డుల ప్ర‌దానోత్స‌వం ప‌లు విధాలుగా చారిత్ర‌క ఈవెంట్‌గా నిలిచింది. 441 రోజులుగా ప్ర‌పంచ సినీ ప్రేమికుల ఎదురుచూపుల‌కు ముగింపు ప‌లుకుతూ 93వ అకాడ‌మీ అవార్డుల ప్ర‌దానం సింపుల్‌గా, సంద‌డిగా జ‌రిగింది.

బెస్ట్ యాక్ట‌ర్ అవార్డుతో ఆస్కార్ చ‌రిత్ర‌లోనే అత్యంత పెద్ద వ‌య‌సులో ఆ అవార్డును పొందిన న‌టునిగా ఆంథోనీ హాప్‌కిన్స్ నిలిచారు. ఆయ‌నకు అవార్డు రావ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. 'జుడాస్ అండ్ బ్లాక్ మెస్స‌య్యా'లో న‌టించిన డేనియ‌ల్ క‌లూయా బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్‌గా నిల‌వ‌గా, 'మిన‌రి'లో న‌టించిన యు-జుంగ్ యూన్ బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డును అందుకున్న తొలి కొరియ‌న్ యాక్ట‌ర్‌గా పేరు తెచ్చుకుంది. 

'నోమాడ్‌ల్యాండ్‌'ను రూపొందించిన క్లో జావో బెస్ట్ డైరెక్ట‌ర్ అవార్డుతో చ‌రిత్ర సృష్టించారు. ఆస్కార్ చ‌రిత్ర‌లో బెస్ట్ డైరెక్ట‌ర్ అవార్డు పొందిన రెండో మ‌హిళ‌గా, తొలి క‌ల‌ర్ వుమ‌న్‌గా ఆమె నిలిచారు. 'మా రైనీస్ బ్లాక్ బాట‌మ్' సినిమాకు ప‌నిచేసిన మియా నీల్‌, జ‌మికా విల్స‌న్ మేక‌ప్ అండ్ హెయిర్ స్టైల్ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న తొలి బ్లాక్ వుమెన్‌గా చ‌రిత్ర సృష్టించారు.

36 నామినేష‌న్లతో బ‌రిలో నిలిచిన ఓటీటీ దిగ్గ‌జం నెట్‌ఫ్లిక్స్ మొత్తం ఏడు అవార్డులు అందుకొని, అన్ని స్టూడియోల‌కెల్లా టాప్ పొజిష‌న్‌లో నిలుచుంది.

కొవిడ్‌-19 మ‌హ‌మ్మారిని దృష్టిలో ఉంచుకొని లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేట‌ర్ నుంచి టెలివిజ‌న్ లైవ్ ద్వారా ఏబీసీ ఈ అతిపెద్ద సినిమా వేడుక‌ను ప్ర‌సారం చేసింది. ఈ ఈవెంట్‌కు హాజ‌రైన నామినీస్ అంతా క‌నీసం రెండు కొవిడ్‌-19 పీసీఆర్ టెస్టులు చేయించుకొని వ‌చ్చిన‌వారే.

2021 ఆస్కార్ విజేత‌ల పూర్తి లిస్ట్ ఇదే...
బెస్ట్ పిక్చ‌ర్‌:  నోమాడ్‌ల్యాండ్ 
బెస్ట్ యాక్ట‌ర్‌:  ఆంథోనీ హాప్‌కిన్స్ (ద ఫాద‌ర్‌)
బెస్ట్ యాక్ట్రెస్‌:  ఫ్రాన్సెస్ మెక్‌డోర్మండ్ (నోమాడ్‌ల్యాండ్‌)
బెస్ట్ డైరెక్ట‌ర్‌:  క్లో జావో (నోమాడ్‌ల్యాండ్‌)
బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్‌:  డేనియ‌ల్ క‌లూయా (జుడాస్ అండ్ బ్లాక్ మెస్స‌య్యా)
బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట్రెస్‌:  యు జంగ్ యూన్ (మిన‌రి)
బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్‌:  ఫైట్ ఫ‌ర్ యూ (జుడాస్ అండ్ బ్లాక్ మెస్స‌య్యా)
బెస్ట్ ఒరిజిన‌ల్ స్కోర్‌:  సోల్ (ట్రెండ్ రెజ్నెర్‌, ఆటిక‌ల్ రాస్‌, జాన్ బ‌టిస్టే)
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే:  ద ఫాద‌ర్ (క్రిస్ట‌ఫ‌ర్ హాంప్ట‌న్‌, ఫ్లోరియ‌న్ జెల్ల‌ర్‌)
బెస్ట్ ఒరిజిన‌ల్ స్క్రీన్‌ప్లే:  ప్రామిసింగ్ యంగ్ వుమ‌న్ (ఎమ‌రాల్డ్ ఫెన్నెల్‌)
బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్‌:  సౌండ్ ఆఫ్ మెట‌ల్‌
బెస్ట్ సినిమాటోగ్ర‌ఫీ:  మాంక్ (ఎరిక్ మెస్స‌ర్‌షిమిట్‌)
బెస్ట్ ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:  మాంక్ (డోనాల్డ్ గ్రాహ‌మ్ బ‌ర్ట్‌, జాన్ పాస్క‌లే)
బెస్ట్ విజువ‌ల్ ఎఫెక్ట్స్‌:  టెనెట్ (ఆండ్రూ జాక్స‌న్‌, డేవిడ్ లీ, ఆండ్రూ లాక్‌లీ, స్కాట్ ఫిష‌ర్‌)
బెస్ట్ సౌండ్‌:  సౌండ్ ఆఫ్ మెట‌ల్ (నికొల‌స్ బెక‌ర్‌, జైమే బ‌క్ష‌త్‌, మిషెల్లే కౌట్టోలెంక్‌, కార్లోస్ కోర్టెస్‌, ఫిలిప్ బ్లాఢ్‌)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్‌:  మా రైనీస్ బ్లాక్ బాట‌మ్ (ఆన్ రోత్‌)
బెస్ట్ మేక‌ప్ అండ్ హెయిర్‌స్టైలింగ్‌:  మా రైనీస్ బ్లాక్ బాట‌మ్ (సెర్గియో లోపెజ్‌-రివేరా, మియా నీల్‌, జ‌మికా విల్స‌న్‌)
బెస్ట్ డాక్యుమెంట‌రీ ఫీచ‌ర్‌:  మై ఆక్టోప‌స్ టీచ‌ర్‌
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ స‌బ్జెక్ట్‌:  కొలెట్‌
బెస్ట్ యానిమేటెడ్ ఫీచ‌ర్ ఫిల్మ్‌:  సోల్‌
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్‌:  ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఐ ల‌వ్ యూ
బెస్ట్ లైవ్ యాక్ష‌న్ షార్ట్ ఫిల్మ్‌:  టు డిస్టాంట్ స్ట్రేంజ‌ర్స్‌
బెస్ట్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిచ‌ర్ ఫిల్మ్:  అన‌ద‌ర్ రౌండ్ (డెన్మార్క్‌)