English | Telugu
పవన్ 'బాక్సాఫీస్ పవర్' ఏంటో చూపించిన టాప్ 10 హిట్స్ ఇవే..
Updated : Sep 1, 2023
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తెలుగునాట ఈ పేరే ఒక బ్రాండ్. స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్, స్మైల్, యాక్టింగ్ అన్నింటికి మించి సింప్లిసిటీ.. పవన్ ని అప్పట్లో యూత్ ఐకాన్ గా నిలిపాయి. పాతికేళ్ళకి పైగా కెరీర్ లో ఇప్పటివరకు 28 సినిమాలతో సందడి చేశారు పవన్. వీటిలో సగానికిపైగా విజయపథంలో సాధించాయి. ఇక పవన్ కెరీర్ లో టాప్ 10 మూవీస్ విషయానికి వస్తే..
10. గోకులంలో సీత: పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫస్ట్ హిట్ మూవీ గోకులంలో సీత. టైటిల్ రోల్ లో రాశి నటించిన ఈ సినిమాని ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేశారు. 1997లో ఈ మూవీ రిలీజైంది.
9. భీమ్లా నాయక్: పవన్ ని పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేసిన సినిమాల్లో భీమ్లా నాయక్ ది ప్రత్యేక స్థానం. సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో శక్తివంతమైన పోలీస్ అధికారి భీమ్లా నాయక్ గా కనిపించారు పవన్. 2022లో ఈ సినిమా విడుదలైంది.
8. జల్సా: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన మొదటి సినిమా ఇది. మ్యూజికల్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీలో సంజయ్ సాహుగా విభిన్న కోణాలున్న పాత్రలో మెప్పించారు పవర్ స్టార్. 2008లో ఈ చిత్రం జనం ముందు నిలిచింది.
7. అత్తారింటికి దారేది: పవన్ ని కుటుంబ ప్రేక్షకులకు ఎంతో దగ్గర చేసిన సినిమా ఇది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ.. రిలీజ్ కి ముందే ఆన్ లైన్ లో లీకైనా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించింది. 2013లో ఈ ఫ్యామిలీ డ్రామా తెరపైకి వచ్చింది.
6. గబ్బర్ సింగ్: 2012లో వచ్చిన గబ్బర్ సింగ్.. ఆ ఏడాది హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిన మూవీ. ఇందులో టైటిల్ రోల్ లో చెలరేగిపోయారు పవన్. ఈ కాప్ డ్రామాని హరీశ్ శంకర్ తెరకెక్కించారు.
5. తమ్ముడు: నటుడిగా పవన్ కళ్యాణ్ స్థాయిని పెంచిన సినిమాల్లో తమ్ముడు ఒకటి. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సుబ్బు, సుభాష్ గా తన అద్భుతాభినయంతో ఆకట్టుకున్నారు పవన్. 1999లో ఈ బ్లాక్ బస్టర్ మూవీ రిలీజైంది. పి.ఎ. అరుణ్ ప్రసాద్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు.
4. బద్రి: నువ్వు నందవైతే.. నేను బద్రి బద్రినాథ్.. అంటూ సరికొత్త హీరోయిజాన్ని ఆవిష్కరించిన సినిమా బద్రి. పవన్ కెరీర్ లో వెరీ స్పెషల్ మూవీగా నిలిచిన ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ తెరకెక్కించారు. 2000లో ఈ సినిమా రిలీజైంది.
3. సుస్వాగతం: కెరీర్ ఆరంభంలో పవన్ ని యువతకు చేరువ చేసిన సినిమా సుస్వాగతం. ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో గణేశ్ అనే ప్రేమికుడు పాత్రలో జీవించేశారు పవన్. మరీముఖ్యంగా.. పతాక సన్నివేశాల్లో పవన్ నటన చూసి ఫిదా అవనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. 1998లో వచ్చిన ఈ చిత్రాన్ని భీమనేని శ్రీనివాస రావు తెరకెక్కించారు.
2. తొలిప్రేమ: పవన్ కళ్యాణ్ ని ప్రతి ఒక్కరూ ఇష్టపడేలా చేసిన సినిమా తొలిప్రేమ. స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ.. ఇటు యువతరాన్ని, అటు కుటుంబ ప్రేక్షకులను భలేగా ఆకట్టుకుంది. ఇందులో బాలు పాత్రలో ఎంతో సహజంగా నటించారు పవన్. 1998లో తెరపైకి వచ్చిన ఈ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీని ఎ. కరుణాకరన్ రూపొందించారు.
1. ఖుషి: ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని సినిమాల్లో ఖుషిది ప్రత్యేక స్థానం. సరదా ప్రేమకథగా తెరకెక్కిన ఈ మ్యూజికల్ సెన్సేషన్ లో బెంగాల్ టైగర్ సిద్ధు.. సిద్ధార్థ్ రాయ్ గా పవన్ విజృంభించారు. ఎస్.జె. సూర్య రూపొందించిన ఖుషి.. 2001లో థియేటర్స్ లోకి వచ్చింది.