English | Telugu
పవన్ నటించిన రీమేక్ మూవీస్ ఇవే.. గెస్ట్ రోల్స్ తో సహా లిస్ట్ ఇదే
Updated : Sep 1, 2023
తెలుగునాట రీమేక్ మూవీస్ కి చిరునామాగా నిలిచిన కథానాయకుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. అతిథి పాత్రలతో కలుపుకుని మొత్తం 28 సినిమాల్లో నటించారు పవన్. విశేషమేమిటంటే.. వీటిలో 15 చిత్రాలు వేరే భాషల్లో తెరకెక్కిన సినిమాలకు రీమేక్ వెర్షన్స్ కావడం విశేషం. ఇక పవన్ నటించిన రీమేక్ మూవీస్ విషయానికి వస్తే..
తొలి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి.. హిందీ మూవీ ఖయామత్ సే ఖయామత్ కి రీమేక్. ఇక రెండో సినిమా గోకులంతో సీత.. తమిళ చిత్రం గోకులత్తిల్ సీతైకి రీమేక్. మూడో సినిమా సుస్వాగతం కూడా కోలీవుడ్ ఫిల్మ్ లవ్ టుడేకి రీమేక్. ఇక ఐదో చిత్రమైన తమ్ముడు.. హిందీ పిక్చర్ జో జీతా వోహీ సికందర్ కి తెలుగు వెర్షన్. అలాగే ఏడో సినిమా ఖుషి.. అదే పేరుతో తెరకెక్కిన తమిళ్ మూవీకి రీమేక్. అదేవిధంగా 13వ చిత్రమైన అన్నవరం కూడా కోలీవుడ్ సినిమా తిరుప్పాచ్చికి తెలుగు వెర్షన్. ఇక 17వ చిత్రమైన తీన్ మార్ ఏమో హిందీ పిక్చర్ లవ్ ఆజ్ కల్ కి, 19 సినిమా అయిన గబ్బర్ సింగ్ కూడా బాలీవుడ్ ఫిల్మ్ దబాంగ్ కి రీమేక్స్. అదేవిధంగా 22వ చిత్రం గోపాల గోపాల కూడా హిందీ మూవీ ఓ మై గాడ్ కి, 24వ సినిమా కాటమరాయుడు తమిళ చిత్రం వీరమ్ కి తెలుగు రూపాలు. అలాగే, 26వ చిత్రం వకీల్ సాబ్ బాలీవుడ్ పిక్చర్ పింక్ కి, 27వ సినిమా భీమ్లా నాయక్ ఏమో మాలీవుడ్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ కి, 28వ చిత్రం బ్రో ఏమో తమిళ సినిమా వినోదాయ సిత్తమ్ కి రీమేక్ వెర్షన్స్. వీటితో పాటు పవన్ అతిథి పాత్రలో మెరిసిన శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ సంగతి తీసుకుంటే.. ఈ రెండు సినిమాలు కూడా బాలీవుడ్ సిరీస్ మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్ కి తెలుగు రీమేక్స్. కాగా, ఈ మొత్తం రీమేక్స్ లో తొమ్మిది సినిమాలు విజయపథంలో పయనించడం విశేషం.
(సెప్టెంబర్ 2.. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా)