English | Telugu

నాగ్ తో ఎక్కువ సినిమాలు చేసిన దర్శకుడెవరు.. వీరిది హ్యాట్రిక్ హిట్స్ కాంబో కూడా!


సెంచురీ క్లబ్ కి చేరువలో ఉన్న కథానాయకుల్లో కింగ్ నాగార్జున ఒకరు. వచ్చే ఏడాది 'శతచిత్రాల కథానాయకుడు' ట్యాగ్ తో మురిపించనున్నారాయన. కాగా, ఈ ప్రయాణంలో ఎంతో మంది దర్శకులతో ముందుకు సాగిన నాగ్.. ఒకరితో మాత్రం తొమ్మిది సినిమాలు చేశారు. ఇంతకీ ఆ దర్శకుడెవరో తెలుసా.. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు. 

అగ్ని పుత్రుడు (1987)తో మొదలైన నాగ్, రాఘవేంద్రరావు కాంబో.. ఆపై ఆఖరి పోరాటం (1988), జానకి రాముడు (1988), అగ్ని (1989), ఘరానా బుల్లోడు (1995), అన్నమయ్య (1997), శ్రీరామదాసు (2006), షిరిడి సాయి (2012), ఓం నమో వేంకటేశాయ (2017) వరకు సాగింది. వీటిలో ఆఖరి పోరాటం, జానకి రాముడు, ఘరానా బుల్లోడు, అన్నమయ్య, శ్రీరామదాసు మంచి విజయం సాధించాయి. అంటే.. ఘరానా బుల్లోడు, అన్నమయ్య, శ్రీరామదాసు రూపంలో ఈ కాంబో హ్యాట్రిక్ హిట్స్ కూడా చూశారన్నమాట. కాగా, రాఘవేంద్రరావు తరువాతి స్థానంలో ఎ. కోదండరామిరెడ్డి, రామ్ గోపాల్ వర్మ ఉన్నారు. వీరిద్దరూ నాగ్ తో అరడజను సినిమాలు చేశారు.

(ఆగస్టు 29.. నాగార్జున బర్త్ డే సందర్భంగా)