English | Telugu

నాగ్ తో 35 ఏళ్ళు రొమాన్స్ చేసిన హీరోయిన్.. ఎవరో తెలుసా!

టాలీవుడ్ రొమాంటిక్ హీరోల్లో కింగ్ నాగార్జున ఒకరు. ఆన్ స్క్రీన్ రొమాన్స్ విషయంలో నాగ్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏ హీరోయిన్ తోనైనా తన కెమిస్ట్రీ అద్భుతంగా కుదురుతుంది. అలాంటి నాగ్ తో సిల్వర్ స్క్రీన్ పై ఎక్కువ కాలం రొమాన్స్ చేసిన హీరోయిన్ గా ఒకరికి స్పెషల్ ఇమేజ్ ఉంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. గ్లామర్ క్వీన్ రమ్యకృష్ణ.

వివరాల్లోకి వెళితే.. 1987లో విడుదలైన సంకీర్తన చిత్రంతో నాగ్, రమ్య కాంబో మొదలవగా.. ఆపై వీరి కలయికలో ఇద్దరూ ఇద్దరే (1990), అల్లరి అల్లుడు (1993) (స్పెషల్ సాంగ్), హలో బ్రదర్ (1994), క్రిమినల్ (1994), ఘరానా బుల్లోడు (1995), అన్నమయ్య (1997), చంద్రలేఖ (1998), సోగ్గాడే చిన్ని నాయనా (2016), బంగార్రాజు (2022) చిత్రాలు వచ్చాయి. అంటే.. వెండితెరపై నాగార్జున, రమ్యకృష్ణ జోడీ 35 ఏళ్ళు రొమాన్స్ చేశారన్నమాట. ఇలాంటి రికార్డు తెలుగునాట అరుదనే చెప్పాలి.