English | Telugu
కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ ఏంటో తెలుసా!
Updated : Jul 22, 2023
శతాధిక చిత్రాల దర్శకుడిగా పేరొందిన కోడి రామకృష్ణ.. ఒకవైపు స్టార్ హీరోలతో భారీ విజయాలు చూస్తూనే, మరోవైపు ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ లోనూ తనదైన ముద్ర వేశారు. కోడి రామకృష్ణ తెరకెక్కించిన సక్సెస్ ఫుల్ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ వివరాల్లోకి వెళితే..
తరంగిణి: 1982లో వచ్చిన హిట్ మూవీ ఇది. శ్యామల గౌరి టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో సుమన్, భానుచందర్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. కోడి రామకృష్ణ కెరీర్ లో ఇదే మొదటి నాయికా ప్రాధాన్య చిత్రం.
ముక్కు పుడక: 1983లో వచ్చిన ఈ సినిమాలో సుహాసినిది ప్రధాన పాత్ర. భానుచందర్, విజయశాంతి, చంద్రమోహన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు.
తలంబ్రాలు: "ఇది పాట కానే కాదు.. ఏ రాగం నాకు రాదు" అనే చార్ట్ బస్టర్ సాంగ్ ఉన్న 'తలంబ్రాలు'లో జీవితది ప్రధాన పాత్ర అయితే.. రాజశేఖర్ ది నెగటివ్ రోల్. 1987లో ఈ సక్సెస్ ఫుల్ మూవీ జనం ముందు నిలిచింది.
మధురానగరిలో: 1991లో వచ్చిన ఈ సినిమాలో నిరోషాది ప్రధాన పాత్ర అయితే.. శ్రీకాంత్, చిన్నా, రవిశంకర్ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
పెళ్ళాం చెబితే వినాలి: టైటిల్ కి తగ్గట్టే ఇది మహిళల చుట్టూ తిరిగే సినిమా. మీనా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో హరీష్ కథానాయకుడు. కోవై సరళ, రాజీవి, వై.విజయ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. 1992లో ఈ మూవీ రిలీజైంది.
పోలీస్ లాకప్: లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ద్విపాత్రాభినయంలో రూపొందిన ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో వినోద్ కుమార్ ముఖ్య పాత్ర పోషించారు. 1993లో ఈ సూపర్ హిట్ మూవీ రిలీజైంది.
అమ్మోరు: 1995లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఇది. అభినేత్రి సౌందర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆల్ రౌండర్ రమ్యకృష్ణది టైటిల్ రోల్. గ్రాఫిక్స్ గురించి తెలుగునాట పదే పదే మాట్లాడుకునేలా చేసిన సినిమా ఇది.
దేవి: ప్రేమ టైటిల్ రోల్ చేసిన ఈ సినిమా అప్పట్లో విజువల్స్ పరంగా టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయింది. 1999లో వచ్చిన 'దేవి' అఖండ విజయం సాధించింది.
అరుంధతి: లేడీ సూపర్ స్టార్ అనుష్క దశ, దిశని మార్చివేసిన విజువల్ వండర్.. 'అరుంధతి'. జేజేమ్మగా అనుష్కని ఆవిష్కరించిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
(జూలై 23.. కోడి రామకృష్ణ జయంతి సందర్భంగా)