English | Telugu

చైతూ ఫస్ట్ ఫిల్మ్ తో.. సిద్ధు జొన్నలగడ్డకి కనెక్షన్ ఏంటి?

'డీజే టిల్లు'తో యువతరాన్ని విశేషంగా అలరించాడు సిద్ధు జొన్నలగడ్డ. ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్ 'టిల్లు స్క్వేర్'లో నటిస్తున్నాడీ టాలెంటెడ్ హీరో. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న ఈ సినిమా.. త్వరలోనే జనం ముందుకు రానుంది. 

ఇదిలా ఉంటే, సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్ కెరీర్ మొదలుపెట్టి చాలా కాలమే అయింది. కరెక్ట్ గా చెప్పాలంటే.. 2009లోనే సిద్ధు నటుడిగా తొలి అడుగులు వేశాడు. అది కూడా.. అంతగా గుర్తింపు లేని పాత్రతో. ఆ వివరాల్లోకి వెళితే.. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా తెరంగేట్రం చేసిన 'జోష్' సినిమాతోనే సిద్ధు కూడా డెబ్యూ ఇచ్చాడు. అందులో కాలేజ్ స్టూడెంట్ గా కనిపించాడు సిద్ధు జొన్నలగడ్డ. అంటే.. చైతూకి హీరోగా, సిద్ధుకి నటుడిగా 'జోష్'నే మొదటి సినిమా అన్నమాట.

ఆపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ఆరెంజ్' (2010)లో సంతోష్ పాత్రలో కాసేపు మెరిశాడు మిస్టర్ జొన్నలగడ్డ. ఆనక మరికొన్ని సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రల్లో ఎంటర్టైన్ చేసిన సిద్ధు.. ప్రవీణ్ సత్తారు డైరెక్టోరియల్ 'గుంటూరు టాకీస్' (2016)తో మెస్మరైజ్ చేశాడు. ఇక కోవిడ్ టైమ్ లో ఓటీటీలో స్ట్రీమ్ అయిన 'కృష్ణ అండ్ హిజ్ లీల', 'మా వింత గాధ వినుమా' (2020)తో మరింత గుర్తింపు తెచ్చుకుని.. 'డీజే టిల్లు' (2022)తో అనూహ్య విజయం అందుకుని సంచలనం సృష్టించాడు. ఏదేమైనా.. చిన్న చిన్న రోల్స్ తో కెరీర్ ఆరంభించి ఇప్పుడు క్రేజీ హీరోగా సిద్ధు దూసుకుపోతున్న వైనం యువతరానికి స్ఫూర్తిదాయకమే.