English | Telugu
ఫస్ట్ ఫిల్మ్‌కి.. ఇప్పుడు.. ఆరుగురు టాప్ స్టార్స్ ఎంతలా మారిపోయారో..!
Updated : May 23, 2021
టాలీవుడ్‌లో మాస్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ ఎవరంటే.. పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్‌చరణ్. ఈ ఆరుగురు స్టార్ల సినిమా విడుదలవుతుందంటే ఉండే హంగామా అసాధారణం. ఫ్యాన్స్ అయితే రికార్డుల వేటలో పడతారు. తమ హీరో ఫస్ట్ డే ఇంత వసూలు చేసింది, అంత వసూలు చేసింది.. అని లెక్కలు చెబుతూ ఏ సెంటర్‌లో, ఏ థియేటర్‌లో రికార్డులు క్రియేట్ చేసిందో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. అలాంటి ఆ ఆరుగురు స్టార్లు తమ తొలి సినిమాల్లో ఎలా కనిపించారో, వాళ్ల రూపం ఎలా ఉందో చూస్తే.. అప్పటికీ, ఇప్పటికీ ఇంతలా వారు మారిపోయారా!.. అని ఆశ్చర్యం కలుగకమానదు. కావాలంటే మీరే చూడండి...
పవన్ కల్యాణ్
ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేయగా 1996లో వచ్చిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు పవన్ కల్యాణ్. అప్పటికీ, ఇప్పుడు వకీల్ సాబ్‌లో కనిపించిన పవన్‌కూ ముఖంలో ఎంత మార్పు వచ్చిందో చూడండి.
మహేశ్‌బాబు
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు రూపొందించగా 1999లో వచ్చిన రాజకుమారుడు మూవీతో హీరోగా పరిచయమైన మహేశ్‌లోని చార్మింగ్ ఇప్పటి సరిలేరు నీకెవ్వరు మూవీలోనూ అలాగే ఉంది. కానీ ఫేస్ మాత్రం బాగా మారిపోయింది.
జూనియర్ ఎన్టీఆర్
వి.ఆర్. ప్రతాప్ దర్శకత్వం వహించిన నిన్ను చూడాలని (2001) చిత్రంతో హీరోగా పరిచయమై లుక్స్ పరంగా విమర్శలు ఎదుర్కొన్న జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు ఎంత గ్లామరస్‌గా మారిపోయాడో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
ప్రభాస్
జయంత్ సి. పరాన్జీ డైరెక్ట్ చేసిన ఈశ్వర్ (2002) మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు ప్రభాస్. అప్పుడు బక్కపలచటి కుర్రాడిగా ఉన్న అతను ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాకు వచ్చేసరికి బాగా మారిపోయాడు. పైగా దృఢకాయుడిలా తయారయ్యాడు.
అల్లు అర్జున్
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తీర్చిదిద్దిన 'గంగోత్రి' (2003) సినిమాతో హీరోగా పరిచయమై, ఏమాత్రం గ్లామర్‌గా లేడనిపించుకున్న అల్లు అర్జున్.. క్రమక్రమంగా లుక్స్ మార్చుకుంటూ అల.. వైకుంఠపురములో సినిమాకు వచ్చేసరికి ఎంత అందంగా మారాడో!
రామ్‌చరణ్
పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేయగా 2007లో వచ్చిన 'చిరుత' చిత్రంతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు రామ్‌చరణ్. ఈ పద్నాలుగేళ్లలోనే అతను లుక్స్ పరంగా చాలా మారిపోయాడని ఇప్పటి రూపాన్ని బట్టి అర్థమవుతుంది.