English | Telugu
'విక్రమ్ వేద' హిందీ రీమేక్ అధికారిక ప్రకటన.. గ్యాంగ్‌స్టర్ గా హృతిక్
Updated : Jul 10, 2021
విజయ్ సేతుపతి, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన సెన్సేషనల్ తమిళ్ మూవీ 'విక్రమ్ వేద'. 2017లో విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఈ మూవీలో విజయ్ సేతుపతి గ్యాంగ్‌స్టర్ గా, మాధవన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు. అయితే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది.
'విక్రమ్ వేద' బాలీవుడ్ రీమేక్ కు రంగం సిద్ధమైంది. ఇందులో హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ 'విక్రమ్ వేద'ను తెరకెక్కించిన పుష్కర్, గాయత్రి దంపతులే.. హిందీ వెర్షన్ కు దర్శకత్వం వహించనున్నారు. హిందీ వెర్షన్ లో హృతిక్ గ్యాంగ్‌స్టర్ గా, సైఫ్ అలీఖాన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే సెప్టెంబర్ 30, 2022లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు కూడా ప్రకటించడం విశేషం.
ప్రస్తుతం బాలీవుడ్ లో సౌత్ రీమేక్ ల ట్రెండ్ నడుస్తోంది. మరి ఈ రీమేక్ తో హృతిక్, సైఫ్ లు ఎలా అలరిస్తారో చూడాలి. ఇక తమిళ 'విక్రమ్ వేద'లో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించగా వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించింది. హిందీ వెర్షన్ లో ఎవరు నటిస్తారో త్వరలోనే తెలిసే అవకాశముంది.