Read more!

English | Telugu

Sandeep Reddy Vanga: ఇదెక్కడి రివెంజ్ అన్నా... అంత పెద్ద సినిమాని ఎలా చూస్తారు?

సందీప్ రెడ్డి వంగ ‘అర్జున్ రెడ్డి’ సినిమా చేసినప్పుడు తెలుగుకి మరో రామ్ గోపాల్ వర్మ వచ్చాడు అన్నారు. ఒక పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ ని ఇచ్చాడు అంటూ సందీప్ రెడ్డి వంగని, ఒక్క సినిమాతోనే స్టార్ డైరెక్టర్ ని చేసారు. అర్జున్ రెడ్డి సినిమానే హిందీలో కిబిర్ సింగ్ గా రీమేక్ చేసాడు సందీప్ రెడ్డి వంగ. బాలీవుడ్ వాళ్లు మాత్రం కబీర్ సింగ్ సినిమా వయోలేంట్ గా ఉందంటూ కామెంట్స్ చేసారు. ఈ రివ్యూస్ సందీప్ ని బాగా హర్ట్ చేసినట్లు ఉన్నాయి, వయోలెంట్ సినిమా అన్నారు కదా అసలు వయోలెన్స్ అంటే ఎలా ఉంటుందో నా నెక్స్ట్ సినిమాలో చూపిస్తా అంటూ రణబీర్ కపూర్ తో ‘అనిమల్’ సినిమా చేస్తున్నాడు.

డిసెంబర్ 1న వరల్డ్ వైడ్ ఆడియన్స్ రానున్న అనిమల్ మూవీ టీజర్ రిలీజ్ చేసిన సందీప్, వయోలెన్స్ అంటే ఎలా ఉంటుందో శాంపిల్ చూపించాడు. టీజర్ కే ఇలా ఉంటే ఇక థియేటర్ లో సినిమా చూస్తే ఏమై పోతారో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒక వైల్డ్ ఫస్ట్ నైట్, భారి యాక్షన్ ఎపిసోడ్, ఎండ్ లో ఊహించని ఒక క్లైమాక్స్ అనిమల్ సినిమాలో ఉంటాయని సమాచారం. వీటన్నింటికన్నా వైల్డ్ స్టెప్ ఏంటంటే... అనిమల్ సినిమా దాదాపు మూడున్నర గంటలు ఉండడమే. అనిమల్ మూవీ రన్ టైంని సందీప్ రెడ్డి వంగ లాక్ చేసాడని సమాచారం. మూడు గంటల పన్నెండు నిమిషాల నిడివితో అనిమల్ సినిమా రిలీజ్ కనుందట. ఇదే నిజమైతే ఇండియాలో అత్యధిక లెంగ్త్ తో సినిమా అవుతున్న మొదటి పాన్ ఇండియా సినిమాగా అనిమల్ నిలుస్తుంది. మరి ఇది బాలీవుడ్ మీద రివెంజా లేక నిజంగానే సినిమా అంత నిడివిని కోరుకుంటుందా అనేది చూడాలి.