Read more!

English | Telugu

షారుఖ్ సినిమాలో విజ‌య్ గెస్ట్ రోల్ చేస్తారా? 

ఈ ఏడాదిని బాలీవుడ్ ప‌ఠాన్ సినిమాతో ఇన్నింగ్స్ షురూ చేయ‌బోతోంది. జ‌న‌వ‌రి 25న షారుఖ్ ఖాన్‌, దీపిక న‌టించిన ప‌ఠాన్ రిలీజ్ కానుంది. దాని త‌ర్వాత 2023లో షారుఖ్ సెకండ్ రిలీజ్ జ‌వాన్‌. సౌత్ డైర‌క్ట‌ర్ అట్లీ డైరక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమా జ‌వాన్‌. సౌత్ లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార ఈ మూవీలో నాయిక‌గా న‌టిస్తున్నారు. చాలా వ‌ర‌కు షూటింగ్ కూడా పూర్త‌యింది. విజ‌య్ సేతుప‌తి విల‌న్ రోల్‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో దీపిక గెస్ట్ రోల్ చేస్తున్నార‌నే టాక్ ఎప్ప‌టి నుంచో ఉంది.

 ఇప్పుడు దానికి అద‌నంగా విజ‌య్ పేరు వినిపిస్తోంది. ద‌ళ‌ప‌తి విజ‌య్‌కీ, అట్లీకి మంచి అసోసియేష‌న్ ఉంది. అందువ‌ల్ల ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయ‌మ‌ని అడిగార‌ట అట్లీ. అందుకు విజ‌య్ ఓకే చెప్పార‌నే న్యూస్ వైర‌ల్ అవుతోంది. అదే నిజ‌మైతే విజ‌య్ జోడీగా గెస్ట్ రోల్‌లో క‌నిపిస్తార‌ట దీపిక ప‌దుకోన్‌.
ఆల్రెడీ దీపిక తెలుగులో ప్ర‌భాస్ స‌ర‌స‌న ప్రాజెక్ట్ కెలో న‌టిస్తున్నారు. ఇప్పుడు షారుఖ్ మూవీలో విజ‌య్ స‌ర‌స‌న న‌టిస్తే అది కూడా మ‌రో సౌత్ ఇండియ‌న్ హీరోతో న‌టించిన‌ట్టు కౌంట్ అవుతుంది. అయితే దీని గురించి ఇప్ప‌టిదాకా ఎవ‌రూ అఫిషియ‌ల్‌గా చెప్ప‌లేదు. 

జ‌వాన్ రిలీజ్ గురించి న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా న్యూస్ లీక్ చేశారు అట్లీ. ఈ ఏడాది రెండు రిలీజులున్నాయి అని పోస్ట్ చేశారు. రెండు రిలీజులు ఏంటి? అని అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. ఫిబ్ర‌వ‌రిలో అట్లీ తండ్రి కాబోతున్నారు.  నార్త్ మూవీ జ‌వాన్ రిలీజ్‌జూన్‌లో ఉంటుంది. ఈ రెండు విష‌యాల‌ను క‌లిపి రెండు రిలీజుల‌ని అన్నారు అట్లీ.