Read more!

English | Telugu

'ఖైదీ' హిందీ రీమేక్ 'భోలా' రిలీజ్ డేట్ వచ్చింది

 

ఇటీవల 'దృశ్యం 2'తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన అజయ్ దేవ్‌గణ్ తన తదుపరి సినిమా 'భోలా'తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అయన కెరీర్‌లోనే ఇది మోస్ట్ చాలెంజింగ్ యాక్షన్ డ్రామా అని చెప్పాలి. కార్తీ హీరోగా లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన తమిళ హిట్ ఫిల్మ్ 'ఖైదీ'కి ఇది రీమేక్. దీన్ని అజయ్ దేవ్‌గణ్ స్వయంగా డైరెక్ట్ చేస్తున్నాడు. 2023 మార్చి 30న ఈ సినిమా విడుదల కానున్నది.

రిలీజ్ డేట్‌ని ప్రకటించడంతో పాటు, "ఏక్ చత్తాన్, సౌ సైతాన్. ఇస్ కల్యుగ్ మే ఆ రహా హై #భోలా, 2023 మార్చి 30" అని క్యాప్షన్ ఉన్న కొత్త పోస్టర్‌ను షేర్ చేశాడు దేవ్‌గణ్. 

ఎక్కువగా ఒక రాత్రివేళ జరిగే ఘటనలతో నడిచే ఈ మూవీలో భయం ఎరుగని వ్యక్తిగా ఆయన కనిపించనున్నాడు. పదేళ్లు జైలు జీవితం గడిపి, కన్న కూతుర్ని కలవడానికి ప్రయాణం సాగించే వ్యక్తి మార్గమధ్యంలో డ్రగ్ మాఫియాను, లంచగొండులైన పోలీసులను ఎలా ఎదుర్కొన్నాడనేది సినిమాలోని ప్రధానాంశం.

టబు, అమలా పాల్ (స్పెషల్ అప్పీరెన్స్), అభిషెక్ బచ్చన్ (స్పెషల్ అప్పీరెన్స్), సంజయ్ మిశ్రా, దీపక్ దోబ్రియాల్, మకరంద్ దేశ్‌పాండే తారాగణమైన ఈ మూవీకి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా, అసీం బజాజ్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నాడు.