English | Telugu

ఆ సినిమా నుంచి న‌న్ను త‌ప్పించినందుకు నిర్మాత‌లు సారీ చెప్పారు!

ఒక సినిమాకు తాను డేట్స్ కేటాయించ‌గా, చివ‌రి నిమిషంలో నిర్మాత‌లు త‌న‌ను ఆ సినిమా నుంచి త‌ప్పించార‌నీ, ఆ త‌ర్వాత వారు త‌న‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పార‌నీ న‌టి తాప్సీ ప‌న్ను వెల్ల‌డించింది. ఆ సినిమా పేరును ఆమె బ‌య‌ట‌పెట్ట‌క‌పోయినా, అమ‌ర్యాద‌క‌రంగా త‌న‌ను త‌ప్పించి వేరే న‌టిని తీసుకున్నందుకు నిర్మాత‌ల‌ను తాప్సీ తిట్టిపోసింద‌ని ఇదివ‌ర‌కు ప్ర‌చారంలోకి వ‌చ్చింది.

ఒక తాజా ఇంట‌ర్వ్యూలో, మీడియా ద్వారానే ఆ సినిమాలో తాను భాగం కాద‌నే విష‌యం తెలిసింద‌ని ఆమె చెప్పింది. త‌ర్వాత ఆ చిత్ర నిర్మాత‌లు త‌న‌ను క‌లిసి క్ష‌మాప‌ణ‌లు తెలిపారనీ, కానీ త‌న‌ను త‌ప్పించ‌డానికి అస‌లు కార‌ణాల‌ను వెల్ల‌డించ‌డానికి వెనుకాడార‌నీ తాప్సీ తెలిపింది.

ఆ సినిమాకు త‌న‌ను తీసుకొన్న త‌ర్వాత తొల‌గించ‌డంపై మాట్లాడుతూ, "ఇది నాకు జ‌రిగింది. నేనింకా షూటింగ్‌కు రెడీ కాలేదు. కేవ‌లం నా డేట్స్ ఇచ్చాను. త‌ర్వాత న‌న్ను బ‌య‌ట‌కు విసిరేశారు. అయితే ఈ విష‌యాన్ని వాళ్లు నాకు చెప్ప‌లేదు. మీడియా ద్వారానే ఆ విష‌యం నాకు తెలిసింది." అని వెల్ల‌డించింది తాప్సీ.

'ప‌తి ప‌త్ని ఔర్ వో' మూవీ కోసం తాను కాల్షీట్లు కేటాయించిన‌ట్లు 2019 ప్రారంభంలో తాప్సీ తెలిపింది. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడు ముద‌స్స‌ర్ అజీజ్‌తో మ‌రొక‌రిని తీసుకొమ్మ‌ని నిర్మాత‌లు చెప్పారు. ఆ సినిమాలో కార్తీక్ ఆర్య‌న్‌, అన‌న్యా పాండే, భూమి పెడ్నేక‌ర్ న‌టించారు. టి-సిరీస్ దాన్ని నిర్మించింది.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.