English | Telugu

హాలీవుడ్ ప్ర‌య‌త్నాల్లో షాహిద్ క‌పూర్!

ప్రియాంక చోప్రా, ఆలియా భ‌ట్‌, శ్రుతిహాస‌న్ ఇప్ప‌టికే హాలీవుడ్ బాట ప‌ట్టారు. ప్రియాంక చోప్రా అక్క‌డ వీర లెవ‌ల్లో ఏలుతున్నారు. హాలీవుడ్ మీద మ‌రిన్ని హోప్స్ ఉన్న న‌టుల్లో దీపిక పేరును అసలు మ‌ర్చిపోకూడ‌దు. ఇంత‌కీ ఈ లిస్టంతా ఇప్పుడు ఎందుకు అని అంటున్నారా? విష‌యం ఉంది. ఇప్ప‌టిదాకా చ‌దివిన పేర్ల‌న్నీ హీరోయిన్ల పేర్లు. మ‌రి ఈ లిస్టులో హీరోలు లేరా? ఎందుకు లేరు? ధ‌నుష్‌లాంటివారు ఉన్నారు. ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్న‌వారిలో హాలీవుడ్ ప్లాన్స్ ఏ హీరోకి ఉన్నాయి? షాహిద్ క‌పూర్ సంగ‌తి ఏంటి? ఈ విష‌యాన్ని షాహిద్‌నే అడిగేశారు మీడియా మిత్రులు. షాహిద్ న‌టించిన బ్ల‌డీ డాడీ ప్ర‌మోష‌న్ల‌లో ఈ టాపిక్ తీసుకొచ్చారు. అలీ అబ్బాస్ అలీతో షాహిద్ చేసిన ఫ‌స్ట్ వెంచర్ బ్ల‌డీ డాడీ. ఈ ప్ర‌మోష‌న్ల‌లోనే హాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడారు హీరో షాహిద్‌. ``ఆలియా, ప్రియాంక చోప్రా, అలీ ఫాజ‌ల్ త‌ర‌హాలో మీరు కూడా వెస్ట్ లో మార్కెట్ క్రియేట్ చేసుకుని ఎంట్రీ ఇవ్వాల‌నుకుంటున్నారట క‌దా`` అని అడిగేసింది మీడియా.

``నాకు ఇక్క‌డ చాలా కంఫ‌ర్ట్ గా ఉంది. నేనిప్పుడు హాలీవుడ్‌కి వెళ్లి అక్క‌డేదో ట్రాష్ చేసి ప్రూవ్ చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. అంత‌గా చేయాల‌నిపిస్తే త‌మిళ్‌, తెలుగు, మల‌యాళ సినిమాలు చేసుకుని నాలోని న‌టుడిని శాటిస్‌ఫై చేసుకుంటా. రెండు ద‌శాబ్దాలుగా ఇక్క‌డే ఉన్నా. నా ఫిల్మ్ ఫెట‌ర్నిటీ అంటే నాకు గౌర‌వం ఉంది. ప్రేమ ఉంది. చాలా కంఫ‌ర్ట‌బుల్‌గా ఉన్నాను. మంచి ప‌ని చేతినిండా ఉంది. దాన్ని చేసుకుంటున్నా. హాలీవుడ్‌కి వెళ్తేనే ఎదిగిన‌ట్టు కాదు. ఆ మాట‌కొస్తే సౌత్ నుంచి నాకు ఎవ‌రైనా మంచి రోల్స్ ఆఫ‌ర్ చేస్తే చేయ‌డాన్ని కూడా ఎదిగిన‌ట్టే భావిస్తాను. పెర్ఫార్మెన్స్ ప‌రంగా ప్రూవ్ చేసుకోవడానికో, కేలిబ‌ర్‌ని చూపించుకోవ‌డానికో అయితే హాలీవుడ్ దాకా వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. అక్క‌డేదో పిచ్చివి చేయాల్సిన ప‌నిలేదు. మారుతున్న కాలానికి త‌గ్గ‌ట్టు కొంద‌రు మారాల‌నుకుంటారు. అది వాళ్ల ఇష్టం. నేను జ‌స్ట్ ఏదో మారాం అంటే మారాం అన్న‌ట్టు ఉండాల‌నుకోను. న‌న్ను ఎగ్జ‌యిట్ చేసే ఆఫ‌ర్లు వ‌చ్చిన‌ప్పుడు మాత్రం వదులుకోను`` అని అన్నారు షాహిద్‌.