English | Telugu

దీపిక భ‌ర్త‌తో ఆలియా... 76 సెక‌న్ల వీడియో!

ర‌ణ్‌వీర్‌సింగ్‌, ఆలియా జంట‌గా న‌టిస్తున్న సినిమా రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ క‌హానీ. క‌ర‌ణ్‌జోహార్ డైర‌క్ట్ చేస్తున్న సినిమా ఇది. రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ క‌హానీ సినిమా టీజ‌ర్ 76 సెక‌న్ల పాటు సాగుతుంది. ఫ్యామిలీస్‌కి ఈ చిత్రాన్ని చేరువ చేసేలా టీజ‌ర్ క‌ట్ చేశార‌ట క‌ర‌ణ్ జోహార్‌. ఈ చిత్రాన్ని జులై 28న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. రాఖీ ఔర్ రాణీకీ ప్రేమ్ క‌హానీ టీమ్ ఇప్ప‌టికి ప‌ది పోస్ట‌ర్ల‌ను రిలీజ్ చేసింది. ర‌ణ్‌వీర్ సింగ్‌, ఆలియా భ‌ట్‌, వాళ్ల ఫ్యామిలీ మెంబ‌ర్స్ ని ఈ పోస్ట‌ర్ల ద్వారా ఆడియ‌న్స్ కి రీచ్ అయ్యేలా ప్లాన్ చేశారు మిస్ట‌ర్ క‌ర‌ణ్‌. దాంతో పాటు రెండు నెల‌ల పాటు జోరుగా క్యాంపెయిన్ చేయాల‌ని డిసైడ్ అయ్యారు. టీజ‌ర్లు, పాట‌లు, ట్రైల‌ర్ల‌తోనే కావాల్సినంత బ‌జ్ తెచ్చుకోవాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు యూనిట్ మెంబ‌ర్స్. అందులో భాగంగానే 76 సెక‌న్ల టీజ‌ర్‌ని ఇప్ప‌టికే క‌ట్ చేశారు. ఈ టీజ‌ర్‌ని సెన్సార్ అప్రూవ‌ల్‌కి పంపారు క‌ర‌ణ్‌. సెన్సార్ కూడా ఎలాంటి క‌ట్స్ లేకుండా టీజ‌ర్‌ని యాక్సెప్ట్ చేసింద‌ట‌.

క‌ర‌ణ్ జోహార్ సినిమా అంటేనే ఫ్యామిలీస్‌కి ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. అదే కాన్సెప్ట్ తో ఈ సినిమాను జోరుగా ప్ర‌మోట్ చేయ‌డానికి క‌ర‌ణ్‌జోహార్ సిద్ధ‌మ‌వుతున్నారు. పాట‌ల‌ను, ట్రైల‌ర్‌ని కూడా గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఈ నెలాఖ‌రునుంచి మెయిన్ ప్ర‌మోష‌న్ మొద‌ల‌వుతుంది. ``జూన్ లాస్ట్ హాఫ్‌లో టీజ‌ర్‌ని విడుద‌ల చేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే టీజ‌ర్ రిలీజ్‌కి సంబంధించిన డేట్ లాక్ అయింది. ప్రీ టీజ‌ర్‌లాగా డేట్‌ని అనౌన్స్ చేస్తారు. టిపిక‌ల్ క‌ర‌ణ్‌జోహార్ చిత్ర‌మిది. ప్రేక్ష‌కులు ఏమేం కోరుకుంటారో అన్నీ ఇందులో ఉంటాయి. పూర్తి స్థాయి ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. ర‌ణ్‌వీర్‌, ఆలియా క‌లిసి ధ‌ర్మేంద్ర‌తో చేసే సంద‌డిని ప్రేక్ష‌కులు చూసి తీరాల్సిందే. జ‌య బ‌చ్చ‌న్ కేర‌క్ట‌ర్ అద్భుతంగా వ‌చ్చింది. ష‌బానా ఆజ్మీ రోల్ మాత్రం స‌స్సెన్స్`` అని అన్నారు క‌ర‌ణ్ టీమ్‌. రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ క‌హానీకి మెయిన్ ఎసెట్ సంగీత‌మే అని అంటున్నారు మూవీ వ‌ర్గాలు.