English | Telugu

సల్మాన్ ఖాన్ ఎప్పుడు ఎలా పడుకుంటాడో తెలుసా..జైల్లో కూడా జరిగిందని మీకు తెలుసా 

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan)ప్రస్తుతం 'సికందర్'(Sikandar)అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.ఏఆర్  మురుగదాస్(Ar Murugadas)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రష్మిక హీరోయిన్ గా చేస్తుండగా, అగర్వాల్,సత్యరాజ్,శర్మన్ జోషి కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.రంజాన్ కానుకగా ప్రేక్షకుల మందుకు రానున్న ఈ మూవీలో సల్మాన్ డ్యూయల్ రోల్ లో చేస్తుండగా,ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది.

రీసెంట్ గా సల్మాన్ ఒక పాడ్ కాస్ట్ లో పాల్గొన్నాడు.అందులో ఆయన మాట్లాడుతు నేను రోజుకి రెండు గంటలు మాత్రమే నిద్రపోతాను.కొన్ని సార్లు సినిమా చిత్రీకరణ సమయంలో,సన్నివేశాల మధ్య విరామం దొరికినప్పుడు ఒక కునుకు కూడా తీస్తుంటాను.కానీ షూటింగ్ లేనప్పుడు,ఖాళీగా ఉన్నప్పుడు కావాల్సినంత నిద్రపోతాను.అందుకే జైల్లో ఉన్నప్పుడు హ్యాపీగా ఎనిమిది గంటలు పడుకున్నాను.నేను ప్రయాణం చేసే విమానంలో సాంకేతిక లోపాలు వచ్చి ఆగిపోయినా కూడా హ్యాపీగా నిద్రపోతాను.

 నేను హీరో అవుతానని అన్నప్పుడు నువ్వు యాక్టింగ్ చేయగలవా,పది మందిని కొట్టగలవా,ఎందుకు ఇవన్నీ,లాయరో, పోలీసో అవ్వమని మా నాన్న చెప్పాడు.కానీ నేను మాత్రం పట్టుదలతో హీరోని అయ్యాను.ఇక్కడ చాలా పోటీ ఉంటుంది,అందుకే తోటి నటులతో పోల్చుకుంటూ ముందుకు సాగాలి. వాళ్ళ ద్వారా  ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలనే విషయాల్ని వెల్లడి చేసాడు.