English | Telugu

ముక్కుమొహం తెలియని వాళ్ళకి 700 కోట్లా.. పుష్ప పార్ట్ 2 గురించేనా!

ముక్కుమొహం తెలియని వాళ్ళకి 700 కోట్లా.. పుష్ప పార్ట్ 2 గురించేనా!

రచయితకి హీరోతో పాటు సమానంగా స్టార్ డమ్ తెచ్చి పెట్టిన లెజండరీ రైటర్స్ సలీం జావేద్(Salim Javed)అందాజ్, షోలే, జంజీర్,దీవార్,త్రిసూల్,డాన్,శక్తి,,మిస్టర్ ఇండియా,దోస్తానా,షాన్ వంటి పలు హిట్ చిత్రాలకి రచన చేసి భారతీయ చిత్రానికి ఒక సరికొత్త రూపురేఖల్ని అద్దారు.ఆ ద్వయంలో ఒకడైన జావేద్ పూర్తి పేరు జావేద్ అక్తర్(Javed Akthar)బేతాబ్,దునియా,సాగర్,అర్జున్,డెకాయిట్,ఖేల్,రూప్ కి రాణి చొరొంకో రాజా,షారుక్ తో  డాన్ లాంటి సినిమాలకి సోలోగా రచన చేసి ఎనలేని ఖ్యాతిని సంపాదించాడు.పాటల రచయితగా కూడా సుమారు 100 కి పైగా అద్భుతమైన పాటలు రాసిన జావేద్ కి బాలీవుడ్ చిత్ర పరిశ్రమతో ఐదు దశాబ్దాలపైనే అనుబంధం ఉంది.

 రీసెంట్ గా బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన అమీర్ ఖాన్(Amir Khan)తో కలిసి జావేద్ ఒక ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనడం జరిగింది.అందులో ఆయన మాట్లాడుతు ప్రతి సంవత్సరం బాలీవుడ్ లో కొత్త తరహా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.కానీ గతంలో లాగా,హిందీ ప్రేక్షకులు బాలీవుడ్ సినిమాలకి కనెక్ట్ కావడం లేదు.ముక్కు మొహం తెలియని దక్షిణాది నటుల సినిమాలు 600 ,700 కోట్లు రాబడుతున్నాయని చెప్పుకొచ్చాడు.జావేద్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇండియన్ సినీ సర్కిల్స్ లో ఇప్పుడు వైరల్ గా మారాయి. 

ఇక మన తెలుగు చిత్రాలతో పాటు ఇతర దక్షిణాదికి చెందిన చాలా చిత్రాలు కొంత కాలం నుంచి హిందీలో కూడా విడుదలై మంచి విజయాన్ని రాబడుతున్నాయి.లాస్ట్ డిసెంబర్ లో విడుదలైన పుష్ప పార్ట్ 2 (Pushpa part 2)అయితే, అక్కడి బడా హీరోలకి సైతం సాధ్యం కానీ రీతిలో ఒక్క హిందీలోనే  811 కోట్లు దాకా రాబట్టి పెనుతుఫాన్ సృష్టించింది.