English | Telugu
పాత ప్రియులంతా ప్రియాంక దృష్టిలో 'వండర్‌ఫుల్ మెన్'!
Updated : Mar 11, 2021
ఎవరికైనా తొలిప్రేమ, తొలి ముద్దు జ్ఞాపకాలు మధురంగానే ఉంటాయి. నిజానికి తొలిసారి ప్రేమలో పడినప్పుడు ప్రపంచమే కొత్తగా కనిపిస్తుంది. తన జీవితం పూర్తిగా మారిపోయిందనే అనుభూతి కలుగుతుంది. అదే, తొలిప్రేమను కోల్పోయినప్పుడు పడే వేదన కూడా మాటలకు అందనిది. మన జీవితం ముడిపడి ఉన్న వ్యక్తిని కలుసుకొనే దాకా, మనం ఎంతో దూరం ప్రయాణించాల్సి రావచ్చు. అందుకు నిఖార్సయిన ఎగ్జాంపుల్ బాలీవుడ్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ప్రియాంకా చోప్రా.
గ్లామర్ వరల్డ్‌లో లింకప్‌లు, డేటింగ్‌ల రూమర్ల బారినపడని వాళ్లు అత్యంత అరుదు. ప్రియాంక చాలామంది హీరోలతో డేటింగ్ చేసిందనే ప్రచారం ఉంది. షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ నుంచి షాహిద్ కపూర్ దాకా పలువురితో ప్రేమలో పడింది ప్రియాంక.
తన జ్ఞాపకాలు, అనుభవాలతో ఇటీవల ప్రియాంక 'అన్‌ఫినిష్డ్' అనే బుక్ పబ్లిష్ చేసిన విషయం విదితమే. ట్వంటీస్‌లో, థర్టీస్‌లో ఉండగా తను ప్రేమలో పడిన విషయాన్ని పంచుకుందామె. "నేనొక వండర్‌ఫుల్ మ్యాన్‌తో అనుబంధం కలిగి ఉన్నాను. కొన్నేళ్ల పాటు మేం చక్కని సమయాలు గడిపాం. ఆ రిలేషన్‌షిప్ ముగిసేనాటికి, ఏదోవిధంగా నన్ను నేను కోల్పోయాను. నేను అలసిపోయాను, డిస్కరేజ్ అయ్యాను, డిజప్పాయింట్ అయ్యాను. అలాంటి బాధాకరమైన ప్లేస్‌కు ఎలా వచ్చానో నాకు తెలీలేదు." అని ఆమె రాసుకొచ్చింది.
తను మానసికింగా కుంగుబాటుకు గురైన మరో అనుబంధం గురించి కూడా ఆమె చెప్పింది. "ఆ రిలేషన్‌షిప్ ముగిశాక, ఒంటరైపోయినట్లు, కుంగిపోయినట్లు, ఈ లోకంతో విడిపోయినట్లు అనిపించింది. నా లోపల ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదు, ఎందుకంటే నేనెవరికీ చెప్పలేదు కాబట్టి." అని రాసింది ప్రియాంక. తన రిలేషన్‌షిప్‌ను స్పోర్టివ్‌గానే ఆమె ఎప్పుడూ అంగీకరించడం గమనార్హం.