Read more!

English | Telugu

సోష‌ల్ మీడియా అకౌంట్ల నుంచి భ‌ర్త పేరు తీసేసిన‌ ప్రియాంక.. డివోర్స్ రూమ‌ర్స్‌!

 

గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్స్ నుంచి ఇంటిపేరును తొల‌గించింది. త‌న ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్ట‌ర్ అకౌంట్స్ నుంచి 'జోనాస్' పేరును తీసేసింది. కేవ‌లం 'ప్రియాంక' అనే పేరును మాత్ర‌మే ఉంచింది. దీంతో ప్రియాంక‌కు, భ‌ర్త నిక్ జోనాస్‌కు మ‌ధ్య అంతా స‌వ్యంగా లేద‌నే వ‌దంతులు షికార్లు చేస్తున్నాయి. జోనాస్ పేరును ఎందుకు తీసేసింద‌నే దానికి సంబంధించి ప్రియాంక ఎలాంటి పోస్ట్ పెట్ట‌లేదు. మ‌రోవైపు ఆమె త‌ల్లి మ‌ధు చోప్రా ఈ వ‌దంతుల‌ను కొట్టిపారేశారు. "ఇదంతా చెత్త‌, రూమ‌ర్స్‌ను వ్యాప్తి చేయ‌వ‌ద్దు" అని చెప్పారు. కానీ ఇప్ప‌టిదాకా ఉంచిన జోనాస్ పేరును స‌డ‌న్‌గా తీసేయ‌డంతో రూమ‌ర్స్‌కు తావిచ్చిన‌ట్ల‌యింది. అలా ఎందుకు చేసింద‌నే ప్ర‌శ్న‌కు త్వ‌ర‌లోనే స‌మాధానం ల‌భించ‌వ‌చ్చు.

ప్రియాంకా చోప్రా, నిక్ జోనాస్ 2018లో పెళ్లి చేసుకున్నారు. అప్ప‌ట్నుంచీ ఇద్ద‌రూ విడ‌దీయ‌రానంత అనుబంధం క‌న‌పరుస్తూ వ‌స్తున్నారు. ఇటీవ‌లే, ప్రియాంక దీపావ‌ళి పండుగ‌ను తొలిసారిగా నిక్‌తో క‌లిసి వారి ఇంట్లో జ‌రుపుకుంది. దీనికి సంబంధించిన ఫొటోల‌ను షేర్ చేసిన ఆమె, "మా మొద‌టి ఇంట్లో మా మొద‌టి దీపావ‌ళి. ఇది ఎల్ల‌ప్పుడూ స్పెష‌ల్‌గా ఉంటుంది. ఈ సాయంత్రాన్ని చాలా స్పెష‌ల్‌గా మార‌డానికి కృషి చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్యూ. మీరు నా ఏంజెల్స్‌. మా ఇంటిని, మా క‌ల్చ‌ర్‌ను గౌర‌వించిన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌. మీరు నా ఇంటికి తిరిగి వ‌చ్చిన ఫీలింగ్‌ను క‌ల‌గ‌జేశారు. బెస్ట్ హ‌జ్బెండ్‌, భాగ‌స్వామి నిక్ జోనాస్‌.. నీ వ‌ల్ల క‌ల‌లు త‌యార‌వుతున్నాయి. ఐ ల‌వ్ యు. నా హృద‌యం చాలా కృత‌జ్ఞ‌త‌తో నిండిపోతోంది" అని రాసుకొచ్చింది.

అలాగే సెప్టెంబ‌ర్‌లో నిక్ కోసం ఒక అంద‌మైన పోస్ట్‌ను షేర్ చేసింది ప్రియాంక‌. "నువ్వు నా జీవితంలోని ప్రేమ‌వి. నాకు తెలిసిన అత్యంత ద‌యార్ద్ర‌హృద‌యుడైన ప్రేమ‌మూర్తికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నా. ఐ ల‌వ్ యు బేబీ.. థాంక్యూ ఫ‌ర్ బీయింగ్ యు." అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసింది.

వ‌ర్క్ విష‌యానికొస్తే, ప్రియాంక చేతిలో 'సిటాడెల్‌', 'మాట్రిక్స్ 4', 'జీ లే జ‌రా' లాంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.