English | Telugu

స‌ల్మాన్ అంద‌రితో త‌న‌కు సంబంధం అంట‌గ‌ట్టేవాడ‌ని చెప్పిన ఐశ్వ‌ర్య‌!

స‌ల్మాన్ ఖాన్‌, ఐశ్వ‌ర్యా రాయ్ ల‌వ్ ఎఫైర్ గురించి ప్ర‌పంచానికంతా తెలుసు. 'దేవ‌దాస్' షూటింగ్ సెట్స్‌పైకి వ‌చ్చి ఐశ్వ‌ర్య‌తో గొడ‌వ‌ప‌డ్డ స‌ల్మాన్‌ను ఆప‌బోయిన షారుఖ్ అత‌ని దెబ్బ రుచిచూశాడు కూడా. దాంతో ఎందుకొచ్చిన గొడ‌వ అని భావించిన షారుఖ్‌.. ఆ త‌ర్వాత ఐశ్వ‌ర్య‌తో క‌లిసి ప‌నిచేయ‌న‌ని ఎనౌన్స్ చేశాడు. అప్ప‌ట్లో స‌ల్మాన్ అగ్రెసివ్ బిహేవియ‌ర్ టాక్ ఆప్ ద టౌన్‌గా ఉంటూ వ‌చ్చింది. త‌ర‌చూ త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో అత‌ను వివాదాలు సృష్టించుకొనేవాడు. అత‌నితో విసిగిపోయిన ఐశ్వ‌ర్య చివ‌ర‌కు బ్రేక‌ప్ చెప్పేసింది. ఆ త‌ర్వాత ఒక‌రిపై మ‌రొక‌రు చాలా విష‌యాల్లో ఆరోప‌ణ‌లు చేసుకున్నారు.

స‌ల్మాన్‌తో బ్రేక‌ప్ త‌ర్వాత ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ఐశ్వ‌ర్య మాట్లాడుతూ, "మేం విడిపోయాక‌, అత‌ను నాకు ఫోన్‌చేసి, పిచ్చిపిచ్చిగా మాట్లాడేవాడు. నా స‌హ‌న‌టుల‌తో నాకు ఎఫైర్స్ ఉండేవ‌ని అనుమానించేవాడు. అభిషేక్ బ‌చ్చ‌న్ నుంచి షారుఖ్ ఖాన్ దాకా ప్ర‌తి ఒక్క‌రితో నాకు సంబంధం అంట‌గ‌ట్టి తిట్టేవాడు. స‌ల్మాన్ నాపై చేయి చేసుకున్న సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అదృష్ట‌వ‌శాత్తూ దెబ్బ‌లు త‌గిలిన గుర్తులేవీ పైకి క‌నిపించ‌క‌పోవ‌డంతో, షూటింగ్‌కు వెళ్లిపోయేదాన్ని."అని చెప్పింది.

అనంత‌ర కాలంలో త‌న‌కంటే రెండేళ్లు చిన్న‌వాడైన అభిషేక్ బ‌చ్చ‌న్‌ను 2007లో పెళ్లాడింది ఐశ్వ‌ర్య‌. ఆ జంట‌కు 2011లో ఆరాధ్య పుట్టింది. స‌ల్మాన్ మాత్రం ఇప్ప‌టికీ సింగిల్‌గానే ఉండిపోయాడు. రుమేనియాకు చెందిన సింగ‌ర్ యూలియా వంటూర్‌తో ఎఫైర్ న‌డుపుతున్నాడ‌ని కొంత‌కాలంగా వినిపిస్తున్న మాట‌.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.