English | Telugu

షారుక్ కొడుకును అరెస్ట్ చేసిన ఎన్సీబీ డైరెక్ట‌ర్ భార్య ఎవ‌రో తెలుసా?

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ ఆర్య‌న్ ఖాన్ అరెస్ట్ బాలీవుడ్‌ను అనేక విధాలుగా షేక్ చేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌, రియా చ‌క్ర‌వ‌ర్తి డ్ర‌గ్ కేస్ వెలుగులోకి వ‌చ్చిన ఏడాది త‌ర్వాత‌, మ‌రో డ్ర‌గ్ రాకెట్‌ను చూస్తున్నాం. అప్ప‌టి, ఇప్ప‌టి కేసుల‌కు సంబంధించిన పోలిక ఏమంటే - ఎన్సీబీ జోన‌ల్ డైరెక్ట‌ర్ స‌మీర్ వాంఖ‌డే, జుడిషియ‌ల్ క‌స్ట‌డీలో ఒక బాలీవుడ్ మెంబర్‌, అత‌నికి మ‌ద్ద‌తుగా సెల‌బ్రిటీలు ముందుకు రావ‌డం.

ఇక్క‌డ ఒక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే, స‌మీర్ వాంఖ‌డే భార్య క్రాంతి రెడ్క‌ర్ ఒక న‌టి కావ‌డం! ఆమె అజ‌య్ దేవ్‌గ‌ణ్ మూవీ 'గంగాజ‌ల్' (2003)లో ఓ కీల‌క పాత్ర చేశారు. 'జాత్ర‌', 'క‌రార్‌', 'నో ఎంట్రీ పుధే ధోకా ఆహే' లాంటి మ‌రాఠీ సినిమాల్లో ఆమె న‌టించారు. ప్ర‌స్తుతం సొంత ఫ్యాష‌న్ లేబుల్‌ను నిర్వ‌హిస్తూ, ఇన్‌ఫ్లుయెన్స‌ర్‌గా ఉన్నారు.

అంతేకాదు, ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కాంట్ర‌వ‌ర్సీలో ఆమె పేరు వినిపించింది! య‌స్‌. 2013లో ఫాస్ట్ బౌల‌ర్ ఎస్‌. శ్రీ‌శాంత్ ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న‌ప్పుడు ఆమె కూడా అందులో భాగం పంచుకున్నార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత 'పొర‌పాటుగా' ఆమె పేరును అందులో చేర్చిన‌ట్లు పేర్కొన్నారు.