English | Telugu

ఆర్య‌న్ ఖాన్‌కు బ‌ర్గ‌ర్ పెట్టాల‌నుకున్న అమ్మ గౌరీ.. ఒప్పుకోని ఎన్సీబీ!

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో క‌స్ట‌డీలో ఉన్న ఆర్య‌న్ ఖాన్ (షారుక్ కొడుకు)కు తిండి విష‌యంలో ప్ర‌త్యేక స‌దుపాయాలు అందించ‌డానికి అధికారులు అనుమ‌తించ‌డం లేదు. కొడుకు ఏం తింటున్నాడోన‌ని త‌ల్ల‌డిల్లుతున్న త‌ల్లి గౌరీ ఖాన్ అత‌డికి ఇష్ట‌మైన మెక్‌డోనాల్డ్స్ బ‌ర్గ‌ర్ తినిపించాల‌ని ఆశ‌ప‌డినా, ఆమెకు కూడా అధికారులు రెడ్ సిగ్న‌ల్ చూపించారు.

ఎన్సీబీ టీమ్ అరెస్ట్ చేయ‌డంతో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో కూరుకుపోయాడు. అక్టోబ‌ర్ 2న‌ ముంబై నుంచి గోవాకు బ‌య‌లుదేరిన క్రూయిజ్ షిప్‌లో జ‌రుగుతున్న రేవ్ పార్టీపై దాడి చేసిన ఎన్సీబీ టీమ్.. ఆర్య‌న్‌తో పాటు అత‌ని ఏడుగురు ఫ్రెండ్స్‌నూ అరెస్ట్ చేసింది. నిషేధిత డ్ర‌గ్‌ చ‌ర‌స్ వాడాడ‌నేది అత‌నిపై మోపిన అభియోగం. అత‌ని అరెస్ట్ త‌ర్వాత ఆర్య‌న్‌కు స‌పోర్ట్‌గా ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రిటీలు ముందుకు వ‌చ్చారు.

ఒక స్టార్ కిడ్ అయిన‌ప్ప‌టికీ, ఎన్సీబీ క‌స్ట‌డీలో ఉన్న అత‌నికి తిండి విష‌యంలో ఎలాంటి ప్ర‌త్యేక ట్రీట్‌మెంట్ ఇవ్వ‌డం లేదు. మిగ‌తా వారి మాదిరిగానే అత‌ను కూడా ఎన్సీబీ మెస్‌లోని భోజ‌న‌మే చేస్తున్నాడు. ఇంటి నుంచి వ‌చ్చే ఆహారాన్ని తీసుకోవ‌డానికి అత‌నికి అనుమ‌తి ఇవ్వ‌లేదు. అలాంటి వాటికి కోర్టు నుంచి ప‌ర్మిష‌న్ అవ‌స‌రం. ఇంట‌రాగేష‌న్‌కు స‌హ‌క‌రిస్తున్న ఆర్య‌న్ అభ్య‌ర్థించ‌డంతో చ‌దువుకోవ‌డానికి సైన్స్ బుక్స్‌ను మాత్రం అనుమ‌తించారు అధికారులు.

కొడుక్కి ఇష్ట‌మ‌ని కొన్ని మెక్‌డోనాల్డ్స్ బ‌ర్గ‌ర్ పాకెట్ల‌ను తీసుకొని ఆర్య‌న్ త‌ల్లి గౌరీ ఖాన్ ఎన్సీబీ ఆఫీసుకు వెళ్లారు. అయితే భ‌ద్ర‌తాప‌ర‌మైన‌ అంశాల దృష్ట్యా బ‌ర్గ‌ర్ల‌ను లోప‌లికి తీసుకు వెళ్ల‌డానికి ఎన్సీబీ అధికారులు అనుమ‌తించ‌లేదు. దాంతో గౌరీ ఖాన్ నిరాశ‌చెందారు. కాగా, అక్టోబ‌ర్ 5న అధికారుల అనుమ‌తితో ఎన్సీబీ క‌స్ట‌డీలోని కొడుకును క‌లుసుకున్నాడు షారుక్ ఖాన్‌. తండ్రిని చూడ‌గానే ఆర్య‌న్ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడ‌ని స‌మాచారం.