English | Telugu
దీపికను కాదని, ఆలియాతో కనెక్ట్ అవుతున్న తలైవి!
Updated : Jul 4, 2023
సెలబ్రిటీలకు కొన్నిసార్లు మనసులో ఏమీ ఉండదు. కానీ ఎదుటివారు అడిగే ప్రశ్నను బట్టి, అప్పటికప్పుడు ఒక ఒపీనియన్‌కి వచ్చి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలా నయనతారకు కూడా ఓ ప్రశ్న ఎదురైంది. 2018లో ఆమె నటించిన సినిమా కోలమావు కోకిల. ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలో ఓ ఇంట్రస్టింగ్ ప్రశ్నకు సమాధానమిచ్చారు నయనతార. మీకు రణ్‌బీర్ ఇష్టమా? రణ్వీర్ ఇష్టమా అని యాంకర్ నయన్‌ని చూసి ప్రశ్నించారు. నయన్‌తో అక్కడున్న నెల్సన్, అనిరుద్ అందరూ... నయన్‌కి రణ్వీర్ అంటే ఇష్టమనిపిస్తోందని గెస్ చేశారు. కానీ నయనతార, వారి ఊహలకు భిన్నంగా ఆన్సర్ చేశారు. తనకు ఇద్దరూ ఇష్టమేనన్నారు. ఇద్దరి సినిమాలనూ చూస్తానన్నారు. కానీ, రణ్‌బీర్ అంటే కాస్త ఎక్కువ ఇష్టమని ఓపెన్ అయ్యారు. దీపిక భర్తను కాదని, ఆలియా భర్త గురించి మాట్లాడారా? అంటూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు.
నయనతార చూడని హిందీ సినిమా అసలు ఉండదట. అన్ని సినిమాలూ చూసేశారట. అయితే తన ఆల టైమ్ ఫేవరేట్ సినిమా మాత్రం కుచ్ కుచ్ హోతా హై. షారుఖ్ హీరోగా నటించిన సినిమా అది. తన మూడ్ ఎలా ఉన్నా, తనకు ఏం చూడాలనిపించినా నయన్ వెంటనే కుచ్ కుచ్ హోతా హై చూస్తారట. అలాంటిది ఆ సినిమా హీరోతోనే ఇప్పుడు జవాన్ మూవీలో నటిస్తున్నారు నయన్. తలైవి ఇప్పుడు ఫ్యాన్ గర్ల్ మొమెంట్‌ని ఎంజాయ్ చేస్తున్నారని అంటోంది కోలీవుడ్. నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లికి షారుఖ్ అటెండ్ అయిన విషయం తెలిసిందే. సౌత్‌లో ప్రమోషన్లకు వెళ్లని నయనతార, నార్త్ లో జవాన్ ప్రమోషన్లకైనా వెళ్తారా? లేదా? ఇప్పుడు ఇదొక ఇంట్రస్టింగ్ టాపిక్.