Read more!

English | Telugu

నెట్‌ఫ్లిక్స్‌లో న‌వంబ‌ర్ 11న‌ డైరెక్ట్‌గా వ‌స్తోన్న 'మోనికా, ఓ మై డార్లింగ్‌'

 

రాజ్‌కుమార్ రావ్ హీరోగా న‌టించిన 'మోనికా, ఓ మై డార్లింగ్ మూవీ' నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా న‌వంబ‌ర్ 11న విడుద‌ల‌వుతోంది. హుమా ఖురేషి, రాధికా ఆప్టే నాయిక‌లుగా న‌టించిన ఈ డార్క్ కామెడీని వాస‌న్ బాల డైరెక్ట్ చేశాడు. సికింద‌ర్ ఖేర్‌, భ‌గ‌వ‌తి పెరుమాళ్ కీల‌క పాత్ర‌ధారులు. ఈ మూవీ గురించి డైరెక్ట‌ర్ బాల మాట్లాడుతూ "మిస్ట‌రీ, డ్రామా మేళ‌వింపుతో ట్విస్టులున్న క్రైమ్ కామెడీగా ఎంట‌ర్‌టైన్ చేయ‌నున్న మోనికా, ఓ మై డార్లింగ్ అనేది నా డ్రీమ్ ప్రాజెక్ట్‌." అని చెప్పాడు.

రాజ్‌కుమార్ రావ్ ఇటీవ‌ల 'బ‌ధాయీ దో', 'హిట్‌: ద ఫ‌స్ట్ కేస్' సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు కానీ హిట్లు కొట్ట‌లేక‌పోయాడు. అందుకే 'మోనికా, ఓ మై డార్లింగ్' మీద అత‌ని ఫ్యాన్స్ చాలా ఆశ‌లే పెట్టుకున్నారు. ఆగ‌స్ట్ 30న రిలీజ్ చేసిన ట్రైట‌ర్ ప్రామిసింగ్‌గా క‌నిపించ‌డంతో మూవీపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఒక క్యాసినో చుట్టూ ఈ సినిమా క‌థ న‌డుస్తుంది. 'కార‌వాన్' మూవీలోని పాపుల‌ర్ సాంగ్‌లోంచి 'మోనికా ఓ మై డార్లింగ్' టైటిల్‌ను తీసుకున్నారు. థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా రిలీజ‌వుతోంది.