English | Telugu

ల‌స్ట్ స్టోరీస్ 3 ఆన్ కార్డ్స్!

రీసెంట్‌గా నెట్టింట్లో ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్స్ లో ల‌స్ట్ స్టోరీస్ ఒక‌టి. ల‌స్ట్ స్టోరీస్ ఫ‌స్ట్ పార్ట్ కి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. దాంతో సెకండ్ పార్ట్ చేశారు. రోనీ స్క్రూవాలా, ఆషి దువా సారా, నెట్ ఫ్లిక్స్ చేసిన ఈ ఒరిజిన‌ల్స్ కి ఎప్పుడూ జ‌నాల్లో క్రేజ్ ఉంటుంది. సెకండ్ పార్ట్ ని కొంక‌నా సేన్ శ‌ర్మ‌, ఆర్ బాల్కీ, సుజ‌య్ ఘోష్‌, అమిత్ ర‌వీంద్ర‌నాథ్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ నాలుగు క‌థ‌ల్లో అంగ‌ద్ బేడీ, మృణాల్ ఠాకూర్‌, నీనా గుప్తా, విజ‌య్ వర్మ‌, త‌మ‌న్నా భాటియా, కాజోల్‌, కుముద్ మిశ్ర‌, తిలోత్త‌మ శోమ్‌, అమృత సుభాష్ న‌టించారు. ల‌స్ట్ స్టోరీస్ ఫ‌స్ట్ పార్ట్ తో పోలిస్తే, సెకండ్ పార్ట్ కి పెద్ద స్పంద‌న రాలేదు. పైగా టెస్ట్ డ్రైవ్ లాంటి డైలాగుల‌కు మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది.

అయినా యూత్‌లో ఈ యాంథాల‌జీకి ఉన్న రెస్పాన్స్ చూసి మ‌రో సీరీస్ చేయాల‌ని ఫిక్స్ అయ్యారు మేక‌ర్స్. ఆల్రెడీ ప్రీ ప్రొడ‌క్ష‌న ప‌నులు స్టార్ట్ చేశారు. త్వ‌ర‌లోనే అన్నీ డీటైల్స్ ప్ర‌క‌టిస్తామ‌ని అన్నారు. అయితే సెకండ్ పార్ట్ డైరక్ట్ చేసిన న‌లుగురు డైర‌క్ట‌ర్ల‌తోనే థ‌ర్డ్ పార్ట్ చేస్తున్నారా? లేకుంటే కొత్త‌గా ఎవ‌రినైనా అప్రోచ్ అవుతున్నారా అనేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్. సుజ‌య్ ఘోష్ ల‌స్ట్ స్టోరీస్‌2 గురించి ఇటీవ‌ల మాట్లాడుతూ ``ఈ పార్ట్ కి మంచి ఆర్టిస్టులు కుదిరారు. విజ‌య్‌, త‌మ‌న్నా రిలేష‌న్‌షిప్‌ గురించి మాకు ముందు ఏమీ తెలియ‌దు. జ‌స్ట్ వాళ్ల‌యితే బావుంటుంద‌నుకుని తీసుకున్నాం. స్క్రిప్ట్ చ‌దివి త‌మ‌న్నా కొన్ని ప్ర‌శ్న‌ల‌డిగారు. విజ‌య్ వాటికి స‌మాధానాలిచ్చారు. ల‌స్ట్ స్టోరీస్ క్లిక్ అయింది`` అని చెప్పారు.