English | Telugu
మగాళ్లు రచ్చ చేయక్కర్లేదంటున్న విద్య!
Updated : Jul 5, 2023
విద్యాబాలన్ పేరు చెప్పగానే, ఆమెకున్న స్పెషల్ ఆడియన్స్ టాపిక్‌తో ఆటోమేటిగ్గా కనెక్ట్ అయిపోతారు. ఆమె రెస్పాండ్ అయ్యే టాపిక్స్ అంత పెక్యులియర్‌గా ఉంటాయి. విద్యాబాలన్ నటించిన లేటెస్ట్ సినిమా నీయత్. జులై 7న విడుదల కానుంది. ఈ ప్రమోషన్లలో భాగంగా చాలా విషయాలు చెప్పారు విద్య. నీయత్ మూవీకి అనుమీనన్ డైరక్టర్. ఈ సినిమా గురించి విద్యాబాలన్ మాట్లాడుతూ ``నా కెరీర్‌లో అత్యద్భుతమైన అవకాశాలు మహిళా ప్రాధాన్యతగల సినిమాల రూపంలోనే వచ్చాయి. కానీ పోస్ట్ ప్యాండమిక్ ఈ సినిమాలు పెద్దగా వర్కవుట్ కావడం లేదు. ఒక అడుగు వెనక్కి పడ్డట్టు అనిపిస్తోంది. అదే కమర్షియల్ సినిమాల విషయంలో హీరోలు అంత స్ట్రగుల్ పడాల్సిన అవసరం లేదు.
కానీ లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ప్రమోషన్ చాలా కీలకం. హీరోయిన్ సినిమా అనగానే కంటెంట్ నుంచి ప్రతిదీ కొత్తగా ఉండాలి. అలాగని హీరోల కష్టాన్ని నేనేం తక్కువ చేయడం లేదు. ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే మహిళా ప్రాధాన్యం ఉన్న కంటెంట్‌కి కాసింత ఎక్కువ కష్టపడాల్సిన మాట మాత్రం వాస్తవం. అయినా కూడా నేను ఈ కథలను సెలక్ట్ చేసుకోవడానికి ఓ కారణం ఉంది. మరుగునపడ్డ మహిళల జీవితాలను నలుగురితో పంచుకుని స్ఫూర్తి కలిగించాలన్నదే నా తాపత్రయం. అలాగే టెక్నికల్ ఫీల్డ్ లోనూ మహిళలు రాణించాలంటాను. లేడీ డైరక్టర్స్ తమ సినిమాల్లో ఎక్కువగా అమ్మాయిల్ని ప్రోత్సహించాలి. వారిలో ప్రతిభ ఉంటే, తప్పకుండా రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లోనూ వారు రాణిస్తారు`` అని అన్నారు. ఈ సినిమాలో విద్యాబాలన్‌తో పాటు ప్రతీక్‌గాంధి నటించారు. రిలేషన్‌షిప్ డ్రామా ఇది. గతేడాది షూటింగ్ పూర్తయింది.