English | Telugu

కిర‌ణ్ ఖేర్‌కు బ్ల‌డ్ కేన్స‌ర్‌!

దేశంలోని టాలెంటెడ్ యాక్ట్రెస్‌ల‌లో ఒక‌రు, పొలిటీషియ‌న్ అయిన కిర‌ణ్ ఖేర్‌కు బ్ల‌డ్ కేన్స‌ర్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ఆమె సుప్ర‌సిద్ధ న‌టుడు అనుప‌మ్ ఖేర్ స‌తీమ‌ణి. దేవ‌దాస్‌, మై హూనా, దోస్తానా, రంగ్ దే బ‌సంతి లాంటి సినిమాల్లో త‌న అస‌మాన న‌ట‌న‌తో ఆమె ప్రేక్ష‌కుల్ని ఇంప్రెస్ చేస్తూ వ‌స్తున్నారు. ఆమెకు బ్ల‌డ్ కేన్సర్ అనే విష‌యాన్ని అనుప‌మ్ ఖేర్ ఓ నోట్ ద్వారా ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు.

"కిర‌ణ్‌కు మ‌ల్టిపుల్ మైలోమా అని నిర్ధార‌ణ అయ్యింద‌ని అంద‌రికీ తెలియ‌జేస్తున్నా. అది ఒక ర‌క‌మైన బ్ల‌డ్ కేన్స‌ర్‌. ప్ర‌స్తుతం ఆమె ట్రీట్‌మెంట్ తీసుకుంటోంది. ఇదివ‌ర‌క‌టి కంటే మ‌రింత బ‌లంగా ఆమె దీని నుంచి బ‌య‌ట‌ప‌డుతుంద‌ని మేం న‌మ్ముతున్నాం. గొప్ప డాక్టర్లు ఆమెను నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తుండ‌టం మా అదృష్టం. ఆమె ఎప్పుడూ ఓ ఫైట‌ర్‌గానే ఉంటూ వ‌స్తోంది. దీనితో పోరాటంలో ఆమె అలాగే బ‌య‌ట‌ప‌డుతుంది. ఆమె ఎంత మంచి హృద‌యం క‌లిగిన మ‌నిషో, అనేక‌మంది వ్య‌క్తుల ప్రేమ‌ను ఆమె పొంద‌డాన్ని బ‌ట్టి తెలుస్తోంది. మీ ప్రార్థ‌న‌ల్లో, మీ హృద‌యంలో ఆమెకు ప్రేమ‌ను పంపుతుండండి. ఆమె రిక‌వ‌రీ అయ్యే మార్గంలో ఉంది. మీ ప్రేమ‌, స‌పోర్ట్‌కు అంద‌రికీ థాంక్స్." అని ఆయ‌న అందులో రాసుకొచ్చారు.

కిర‌ణ్ ఖేర్ త్వ‌ర‌గా అనారోగ్యం నుంచి కోలుకుని మామూలు మ‌నిషి కావాల‌ని కోరుకుంటున్నామంటూ జుహీ చావ్లా, శిల్పా శెట్టి, సునీల్ శెట్టి, ప‌రిణీతి చోప్రా, రితీశ్ దేశ్‌ముఖ్‌, ర‌ణ‌వీర్ షోరే స‌హా ప‌లువురు సెల‌బ్రిటీలు ట్విట్ట‌ర్ ద్వారా సందేశాలు పంచుకున్నారు. త్వ‌ర‌లోనే కిర‌ణ్ ఖేర్ ఈ క్లిష్ట ద‌శ‌ను అధిగ‌మించి, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వ‌స్తార‌ని ఆశిద్దాం.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.