Read more!

English | Telugu

రూ. 300 కోట్ల దిశ‌గా దూసుకుపోతున్న 'కేజీఎఫ్ 2' హిందీ వెర్ష‌న్‌

 

ప్ర‌శాంత్ నీల్ సృష్టించిన సెల్యులాయిడ్ వండ‌ర్ 'కేజీఎఫ్ చాప్ట‌ర్‌ 2' చ‌రిత్ర పుట‌ల్ని తిర‌గ‌రాస్తూ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. య‌శ్ హీరోగా న‌టించిన ఈ సినిమా హిందీ వెర్ష‌న్ శుక్ర‌వారం రూ. 11.56 కోట్ల (నెట్‌)ను వ‌సూలు చేసింది. దీంతో 9 రోజుల‌కు హిందీ 'కేజీఎఫ్ 2' సాధించిన వ‌సూళ్లు రూ. 280.19 కోట్ల‌కు చేరుకున్నాయి. శ‌ని, ఆదివారం క‌లెక్ష‌న్ల‌తో అది రూ. 300 కోట్ల క్ల‌బ్బులో చేర‌నున్న‌ది. ఇలా 11 రోజుల‌కే రూ. 300 కోట్లు వ‌సూలు చేసిన తొలి హిందీ ఫిల్మ్‌గా 'కేజీఎఫ్ 2' స‌రికొత్త చ‌రిత్ర‌ను సృష్టించ‌బోతోంది. 

షాహిద్ క‌పూర్‌, మృణాల్ ఠాకూర్ జంట‌గా న‌టించ‌గా గౌత‌మ్ తిన్న‌నూరి రూపొందించిన 'జెర్సీ' మూవీ శుక్ర‌వారం రిలీజైన‌ప్ప‌టికీ, సినీ ప్రియులు 'కేజీఎఫ్ 2' చూడ్డానికే ఎక్కువ ఆస‌క్తి చూపిస్తున్నార‌ని ట్రేడ్ విశ్లేష‌కులు చెప్తున్నారు. శుక్ర‌వారంతో పోలిస్తే శ‌ని, ఆదివారాలు క‌లెక్ష‌న్ పెరుగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

అధీర‌గా సంజ‌య్ ద‌త్‌, ప్ర‌ధాన‌మంత్రి ర‌మికా సేన్‌గా ర‌వీనా టాండ‌న్‌, హీరోయిన్‌గా శ్రీ‌నిధి శెట్టి న‌టించిన ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ మ్యూజిక్‌, భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ పెద్ద ఎస్సెట్‌గా నిలిచాయి. డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ ఈ సినిమాను వేరే లెవ‌ల్లో నిలిపింది.