Read more!

English | Telugu

పిల్లల కోసమే పెళ్లి.. లేకపోతే సహజీవనం కంటిన్యూ చేసేవాళ్ళం

పెళ్ళయి, పిల్లలున్న మగవారిని పెళ్లి చేసుకోవడానికి సగటు అమ్మాయిలు ఎవరూ ఇష్టపడరు. కానీ, సినిమా రంగంలో ఇది చాలా సర్వసాధారణమైన విషయం. పెళ్ళయినా, పిల్లలున్నా, తనకంటే ఎన్నో సంవత్సరాలు పెద్దవాడైనా పెళ్ళి చేసుకోవడానికి హీరోయిన్లు వెనుకాడరు. ఇలాంటి వివాహాల వెనుక ఎలాంటి కారణాలు ఉంటాయో తెలీదుగానీ ఎన్నో సంవత్సరాలుగా ఇలాంటివి మనం చూస్తున్నాం. ఈ తరహా పెళ్ళిళ్ళు సౌత్‌ సినిమా ఇండస్ట్రీలలో కూడా జరిగాయి. అయితే సౌత్‌ కంటే నార్త్‌లోనే ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. ఎంతోమంది పెళ్ళయిన హీరోలను పెళ్లి చేసుకొని రెండో భార్యగా జీవనం సాగిస్తున్నారు. వారిలో శ్రీదేవి పేరు ఇక్కడ ప్రస్తావించవచ్చు. మొదట టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా వెలుగొంది, ఆ తర్వాత బాలీవుడ్‌లో సైతం తన టాలెంట్‌ని చూపించిన శ్రీదేవి.. ఆల్రెడీ పెళ్లయి పిల్లలు ఉన్న బోనీ కపూర్‌ని వివాహం చేసుకుంది. 

ఆ తర్వాత మళ్లీ అలాంటి పెళ్ళి చేసుకుంది హీరోయిన్‌ కరీనా కపూర్‌. తన కంటే 10 సంవత్సరాలు పెద్దవాడైన సైఫ్‌ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. అంతకుముందే అతను అమృతను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. సైఫ్‌కు, అమృతకు మధ్య విభేదాలు రావడంతో 2004లో విడాకులు తీసుకున్నారు. 2012లో సైఫ్‌, కరీనా పెళ్ళి చేసుకున్నారు. చాలా సంవత్సరాలు సహజీవనం చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ పెళ్లికి సంబంధించిన విశేషాలను తెలియజేసింది కరీనా. పిల్లల కోసమే పెళ్లి చేసుకున్నామని, లేకపోతే సహజీవనం కంటిన్యూ చేసేవారిమని ఓపెన్‌గా చెప్పేసింది. ఐదేళ్ళు సహజీవనం చేసామని, ఆ తర్వాత పిల్లల  కోసం పెళ్లి చేసుకున్నామని చెప్పింది. పిల్లలు ఉంటే బాధ్యత పెరుగుతుంది అంటూ పిల్లల ఆలోచన లేకపోతే అసలు పెళ్లి ఆలోచన కూడా వచ్చేది కాదు అని కరీనా చెప్పిన సమాధానం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు ఇద్దరు బిడ్డల తల్లిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ.. మరో పక్క కెరీర్‌ను కూడా చక్కగా ప్లాన్‌ చేసుకుంటోంది.