English | Telugu

వ్యాపార రంగంలోకి కంగనా రనౌత్..కేవలం భోజనమే కాదు  

వ్యాపార రంగంలోకి కంగనా రనౌత్..కేవలం భోజనమే కాదు  

పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన భామ 'కంగనారనౌత్'(Kangana Ranaut)రీసెంట్ గా 'ఎమర్జెన్సీ'(Emergency)అనే సినిమాలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ' క్యారక్టర్ లో అత్యద్భుతంగా నటించి ప్రేక్షకుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.పైగా 'ఎమర్జెన్సీ' కి 'కంగనా'నే నిర్మాతగాను,దర్శకురాలిగాను వ్యవహరించి సినిమా పట్ల తనకున్న ఫ్యాషన్ ని తెలియచేసింది.

రీసెంట్ గా కంగనా హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి లో 'ది మౌంటెన్ స్టోరీ'(The Mountain Story)పేరుతో ఒక కేఫ్ ని ఏర్పాటు చేసింది.నిన్న ప్రేమికుల రోజు సందర్భంగా ఆ కేఫ్ ని ప్రారంభించినట్టు 'ఎక్స్ 'వేదికగా ట్వీట్ చేస్తు 'నా చిన్ననాటి కల 'ది మౌంటెన్ స్టోరీ' హిమాలయాల నడిబొడ్డున వికసించింది.ఈ కేఫ్ కేవలం భోజనం చేసే ప్రదేశం కాదు, నా తల్లి వంట గది సువాసనలకి నిలయం' అని చెప్పుకొచ్చింది.కంగనా ప్రస్తుతం బిజెపీ(Bjp)తరుపున హిమాచల్ ప్రదేశ్ లోని 'మండి' పార్లమెంట్ స్థానం నుంచి 'ఎంపీ' గాప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.