English | Telugu

హిందువులకి భయపడి రిలీజ్ చేస్తున్నారా.. అమీర్ ఖాన్ కొడుక్కి నయనతార గతే 

హిందువులకి భయపడి రిలీజ్ చేస్తున్నారా.. అమీర్ ఖాన్ కొడుక్కి నయనతార గతే 

సినిమా పరిశ్రమలోని  ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కి చెందిన వాళ్ళు తమ కొడుకు ఫస్ట్ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చెయ్యాలనుకుంటారు. అలాంటిది అమీర్ ఖాన్ లాంటి  సూపర్ స్టార్  కొడుకు మూవీ  అయితే.. ఒక లెవల్లో హంగామా ఉంటుంది కదా. కానీ ఎలాంటి హడావిడి  లేకుండా సైలెంట్ గా వస్తుంది. టీజర్ రిలీజ్ గాని ట్రైలర్  రిలీజ్ గాని లేదు. పైగా  థియేటర్స్ లో కాకుండా  డైరెక్ట్ గా ఓటిటి లోకి వచ్చేస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇంకో సరికొత్త ఇష్యు అమీర్ కొడుకు మూవీని వెంటాడుతుంది.

అమీర్ ఖాన్ (aamir khan) కొడుకు పేరు  జునైద్ ఖాన్ (junaid khan)మహారాజ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నిజ జీవిత సంఘటల ఆధారంగా ఆ చిత్రం  తెరకెక్కింది. నెట్ ఫ్లిక్స్ (net flix)లో ఈ నెల 14 న విడుదల కానుంది. ప్రముఖ దిగ్గజ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది. హిందూ మత ధర్మానికి వ్యతిరేకంగా మహారాజ్ ఉండబోతుందనే వార్తలు వస్తున్నాయి. హిందూ మతంతో ముడిపడిన  సాధువులని తప్పుడు కోణంలో చుపిస్తున్నారని అంటున్నారు. పోస్టర్స్ కూడా ఆ ఛాయల్లోనే ఉండటంతో   హిందువుల నుంచి  పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అందుకే థియేటర్స్ లో రిలీజ్ చెయ్యకుండా డైరెక్ట్ గా  ఓటిటి లో రిలీజ్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 

 దీంతో  సినిమాని బాయ్ కాట్ చెయ్యాలనే డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది. సోషల్ మీడియాలో మూవీకి వ్యతిరేకంగా కామెంట్స్ కూడా పెడుతున్నారు. హిందువులకి వ్యతిరేఖంగా ఉంటే ఉద్యమిస్తామని హెచ్చరికలు చేస్తున్నారు. ఇలాంటి వివాదాస్పద సినిమాలని ప్రదర్శించే  నెట్ ఫ్లిక్స్ ని కూడా బాన్ చెయ్యాలని అంటున్నారు. గతంలో నయనతార ప్రధాన పాత్రలో హిందు ధర్మానికి వ్యతిరేకంగా  తమిళంలో తెరకెక్కిన అన్నపూర్ణి ని కూడా ప్రదర్శించారని  గుర్తు చేస్తున్నారు. మరి జూన్ 14  తర్వాత  హిందువుల రియాక్షన్ ఎలా  ఉంటుందో చూడాలి. అమీర్ గత చిత్రం పీకే  లో కూడా  హిందూ దేవుళ్ళని అమీర్ ఖాన్ హేళన చేసాడనే వాదనలు వినిపించాయి.

 

హిందువులకి భయపడి రిలీజ్ చేస్తున్నారా.. అమీర్ ఖాన్ కొడుక్కి నయనతార గతే