English | Telugu
33 వేల అడుగుల ఎత్తులో సల్మాన్ ఖాన్.. కమిట్ అయితే అంతే
Updated : Jun 11, 2024
భారతీయ సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు సల్మాన్ ఖాన్(salman khan)మూడున్నర దశాబ్దాల పై నుంచే హీరోగా తన సత్తా చాటుతూ అభిమానులని పెంచుకుంటూ పోతున్నాడు. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతు ఇప్పుడున్న యంగ్ హీరోలకి తన సినిమాలతో సవాలు విసరటం సల్మాన్ స్టైల్. లేటెస్ట్ గా సికందర్ అనే మూవీకి కమిట్ అయ్యాడు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన తాజా న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
సికందర్ (sikander)షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మురుగదాస్ (murugudas)దర్శకుడు. తొలి షెడ్యూల్‌లోనే ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించబోతున్నారని తెలుస్తుంది . ఒకటి కాదు రెండు కాదు ముప్పై మూడు వేల అడుగుల ఎత్తులో ఆ యాక్షన్ సీక్వెన్స్ జరగనున్నాయని అంటున్నారు. ఇందులో సల్మాన్ చేసే ఫీట్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయని,ఎంతో రిస్క్ చేసి మరి సల్మాన్ యాక్షన్ సీన్స్ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి
ఇక ఈ మూవీ మీద ఇండియన్ సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.ఎందుకంటే మురుగుదాస్ గత చిత్రాలన్నీ కూడా సామాజిక బాధ్యత తో కూడుకున్నవే.ఆయా సినిమాల కథ లైన్ కూడా ఎవరు ఊహించని విధంగా ఉంటాయి. . పైగా అమీర్ తో తెరకెక్కించిన గజని తర్వాత మురుగుదాస్ చాలా సంవత్సరాల తర్వాత హిందీలో చేస్తున్నాడు. అదే విధంగా సల్మాన్ కూడా సౌత్ దర్శకుడు తో చాలా ఏళ్ళ తర్వాత చేస్తున్నాడు. దీంతో సల్లు భాయ్ తో మురుగుదాస్ ఎలాంటి కథ చెప్పబోతున్నాడనే క్యూరియాసిటీ అందరిలో ఉంది రష్మిక మందన్న (rashmika mandanna)సల్మాన్ కి జోడి కట్టనుంది. ప్రముఖ అగ్ర నిర్మాత సాజిద్ నడియావాలా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.