English | Telugu

జాన్వికి చేదు అనుభ‌వం

`అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి త‌న‌య` అనే ట్యాగ్ తో బాలీవుడ్ లో క‌థానాయికగా ఎంట్రీ ఇచ్చింది జాన్వీ క‌పూర్. తొలి చిత్రం `ధ‌డ‌క్`తో న‌టిగా మంచి మార్కులు సంపాదించ‌డ‌మే కాకుండా.. క‌మ‌ర్షియ‌ల్ గానూ ఫ‌స్ట్ స‌క్సెస్ ని త‌న ఖాతాలో వేసుకుంది. అలాగే త‌న రెండో సినిమా `గుంజ‌న్ స‌క్సేనా` క‌రోనా ఎఫెక్ట్ తో నెట్ ఫ్లిక్స్ లో రిలీజై.. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందింది. జాన్వి న‌టిగా ఎంతో ఇంప్రూవ్ అయింద‌నే మాట‌లు వినిపించాయి. ఇక `గుంజ‌న్ స‌క్సేనా`కి ముందు వ‌చ్చిన నెట్ ఫ్లిక్స్ ఆంథాల‌జీ `ఘోస్ట్ స్టోరీస్`తోనూ ఫర్లేద‌నిపించుకుంది జాన్వి.

అయితే, ఎటొచ్చి ఆమె తాజా చిత్రం `రూహీ`నే తేడా కొట్టింది. మార్చి 11న విడుద‌లైన ఈ హార‌ర్ కామెడీ డ్రామా.. అటు క‌మ‌ర్షియ‌ల్ గా ఇంప్రెస్ చేయ‌లేక‌పోయింది. అలాగే న‌టిగా జాన్వికి ఒరిగిందేమీ లేద‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. రాజ్ కుమార్ లాంటి టాలెంటెడ్ యాక్ట‌ర్ కూడా ఈ సినిమాని నిల‌బెట్ట‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తమ్మీద‌.. `రూహి` చిత్రం జాన్వికి ఓ చేదు అనుభ‌వ‌మ‌నే చెప్పాలి.మ‌రి.. `దోస్తానా 2`, `గుడ్ ల‌క్ జెర్రీ` చిత్రాల‌తోనైనా జాన్వీ క‌పూర్ మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌స్తుందేమో చూడాలి.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.