Read more!

English | Telugu

'కృష్ణమ్మ' మూవీ రివ్యూ

Publish Date:May 10, 2024

సినిమా పేరు: కృష్ణమ్మ తారాగణం: సత్యదేవ్, మీసాల లక్ష్మణ్, కృష్ణ బూరుగుల, అతిర, అర్చన అయ్యర్, నందగోపాల్, రఘు కుంచే తదితరులు సంగీతం: కాలభైరవ డీఓపీ: సన్నీ కూరపాటి  ఎడిటర్: తమ్మిరాజు రచన, దర్శకత్వం: వి.వి. గోపాల కృష్ణ నిర్మాత: కృష్ణ కొమ్మాలపాటి బ్యానర్: అరుణాచల క్రియేషన్స్ విడుదల తేదీ: మే 10, 2023  జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న కథలు, పాత్రలతో అలరిస్తుంటాడు సత్యదేవ్. ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు 'కృష్ణమ్మ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రచారం చిత్రాలు ఆకట్టుకోవడం, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పకుడు కావడంతో.. 'కృష్ణమ్మ' ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం. కథ: అనాథలైన భద్ర(సత్యదేవ్), కోటి(మీసాల లక్ష్మణ్), శివ(కృష్ణ బూరుగుల) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. చిన్నతనంలోనే జైలు జీవితం గడిపిన శివ.. నేరాల జోలికి పోకుండా ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకొని జీవనం సాగిస్తుంటాడు. భద్ర, కోటి మాత్రం గంజాయి స్వంగ్లింగ్ వంటివి చేస్తూ.. పొట్ట నింపుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో మీనా(అతిర)తో శివ ప్రేమలో పడతాడు. మీనా రాకతో భద్రలో మార్పు వస్తుంది. ఆమెని సొంత చెల్లిలా చూసుకుంటూ.. స్మగ్లింగ్ మానేసి, ఆటో నడుపుతూ సొంత కాళ్ళ మీద నిలబడే ప్రయత్నం చేస్తాడు. ఇలా జీవితాలు సాఫీగా సాగిపోతున్నాయనుకుంటున్న సమయంలో.. మీనా తల్లి ఆపరేషన్ కోసం డబ్బు అవసరమవుతుంది. అంత డబ్బు తమ వద్ద లేకపోవడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో భద్ర, కోటి, శివ స్వంగ్లింగ్ చేయాలని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. ముగ్గురూ ఒక పెద్ద నేరంలో ఇరుక్కుంటారు. అసలు ఆ నేరం ఏంటి? అందులో ఈ ముగ్గురు ఎలా ఇరుక్కున్నారు? శివ-మీనా ప్రేమ కథ ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. విశ్లేషణ: ఎవరో చేసిన నేరానికి అమాయకులు బలైన కథలు ఎన్నో వినుంటాం, చూసుంటాం. 'కృష్ణమ్మ' కూడా ఆ కోవకి చెందినదే. ఫ్రెండ్ షిప్ బ్యాక్ డ్రాప్ లో ఉండే రివేంజ్ స్టోరీ ఇది. బలమైన ఎమోషన్స్ తో రా అండ్ రస్టిక్ గా దర్శకుడు ఈ సినిమాని మలిచాడు. ఓ భారీ ఫైట్ సీన్ తో సత్యదేవ్ పాత్రని పరిచయం చేస్తూ.. సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఆ తర్వాత భద్ర, కోటి, శివ ల గతం చూపిస్తారు. వారి మధ్య స్నేహం, శివ-మీనా ప్రేమకథ వంటి సన్నివేశాలతో ప్రథమార్థం నడుస్తుంది. హీరో లవ్ ట్రాక్ మాత్రం తేలిపోయింది. విరామ సన్నివేశాలకు ముందు వరకు ఫస్టాఫ్ లో పెద్దగా మెరుపులు లేవనే చెప్పాలి. ముగ్గురు స్నేహితులు స్వంగ్లింగ్ చేసే క్రమంలో పోలీసులకు దొరికిపోయి, ఓ పెద్ద కేసులో ఇరుక్కునే సన్నివేశాలు మాత్రం మెప్పించాయి. విరామ సన్నివేశాలు ద్వితీయార్థంపై ఆసక్తి కలిగేలా చేశాయి. ఇక సెకండాఫ్ అంతా సీరియస్ టోన్ లోనే ఉంటుంది. చేయని నేరాన్ని ఒప్పించడం కోసం వారిని పోలీసులు చిత్రహింసలకు గురిచేసే సన్నివేశాలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి. వారు పోలీసులపై తిరగబడే సన్నివేశాలు, జైలు నుంచి బయటకు వచ్చాక చేసే హత్యలు థ్రిల్ ని పంచుతాయి. క్లైమాక్స్ ఊహలకు తగ్గట్టుగా ఉన్నప్పటికీ.. దానిని ఎమోషనల్ మలచిన తీరు బాగుంది.  తాను ఎంచుకున్న కథలో కొత్తదనం లేనప్పటికీ.. ప్రేక్షకులను మెప్పించేలా దానిని తెర మీద చూపించడంలో బాగానే సక్సెస్ అయ్యాడు. పాటలతో పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయిన కాలభైరవ.. నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ బాగుంది. తమ్మిరాజు ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల పనితీరు: భద్ర పాత్రలో మరోసారి తన సజహమైన నటనతో సత్యదేవ్ మ్యాజిక్ చేశాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో అతని నటన టాప్ క్లాస్ లో ఉంది. కోటిగా మీసాల లక్ష్మణ్, శివగా కృష్ణ బూరుగుల కూడా ఆయా పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అతిర, అర్చన అయ్యర్, నందగోపాల్, రఘు కుంచే తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఫైనల్ గా.. బలమైన ఎమోషన్స్ తో రా అండ్ రస్టిక్ ఫిల్మ్ గా రూపొందిన 'కృష్ణమ్మ' ఆకట్టుకుంది. కథలో కొత్తదనం లేనప్పటికీ భావోద్వేగాలు, సహజత్వం ఈ సినిమాని నిలబెట్టాయి. రేటింగ్: 2.75/5

Varun Sandesh next Nindha First Look Poster Astounds

Publish Date:May 10, 2024

Talented hero Varun Sandesh picked a unique and concept-based movie 'Nindha' which garnered a huge attention for its exceptionally destined title poster. The film based on real incidents is written and directed by Rajesh Jagannadham who is also producing it. Produced under the banner of The Fervent Indie Productions, the team has unveiled the film’s first look poster which astounds us for its unique design. The top portion of the poster shows Varun Sandesh with innocence in his face, whereas there is a shadow of a suspicious man behind him. We can see the same shadow behind the upside down blindfolded Lady Justice statue in the down portion. The poster adds to the excitement for the movie. The movie Nindha unfolds – A Kandrakota Mystery. In a blame-filled world, innocence hangs by a thread. Get ready for a wild ride through twists of truth and deceit. Santhu Omkar scores the music, Ramiz Naveeth cranks the camera, and Anil Kumar takes care of editing. The movie is getting ready for release.

రాజమౌళి సినిమాలో చిన్న క్యారెక్టర్‌ చేసేందుకు రూ.5 లక్షలు డిమాండ్‌ చేసిన నటి!

Publish Date:May 9, 2024

ఆమె పేరు వసుంధరాదేవి..అందానికి అందం.. అభినయానికి అభినయం..1965 నుంచి 1980 వరకు దాదాపు 15 సంవత్సరాలు తన అందంతో, అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నటి. ఒక దశలో స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. అయితే ఆ వైభవం ఎంతో కాలం నిలవదని, విధి వారిని దయనీయ పరిస్థితుల్లోకి నెట్టేస్తుందనే విషయం కొందరు నటీనటుల జీవితాలను పరిశీలిస్తే తెలుస్తుంది. అలాంటి హీరోయిన్లలో కాంచన కూడా ఒకరు. ఆమె అసలు పేరు వసుంధరాదేవి. 1939 ఆగస్ట్‌ 16న ప్రకాశం జిల్లా కరవదిలో జన్మించారు. తండ్రి ఉద్యోగ రీత్యా ఆమె కుటుంబమంతా మద్రాస్‌లో స్థిరపడ్డారు. వారిది ఎంతో సంపన్న కుటుంబం. చిన్నతనం నుంచీ ఐశ్వర్యంలో పెరిగారు. ఆరోజుల్లోనే కొన్ని కోట్లు విలువ చేసే ఆస్తులు వారికి ఉండేవి. కాంచనకు 16 సంవత్సరాలు వచ్చే వరకు సమాజంలో అప్పు అనేది ఒకటి ఉంటుందని, మన అవసరానికి ఎవరి దగ్గరైనా తీసుకుంటే దాన్ని తిరిగి చెల్లించాలనే విషయం తెలీదంటేనే అర్థం చేసుకోవచ్చు వారు ఎంత ధనవంతులో. ఓడలు బళ్ళవుతాయి.. బళ్ళు ఓడలవుతాయి అనే సామెత కాంచన కుటుంబం విషయంలో అక్షరాల నిజమైంది. వారి ఆస్తులన్నీ కరిగిపోయాయి. ఒక్కసారిగా పేదరికం వారిని చుట్టుముట్టింది. దాంతో తన చదువును ఇంటర్‌తో ఆపేశారు కాంచన.  కుటుంబ భారాన్ని భుజాన వేసుకొని ఎయిర్‌ హోస్టెస్‌గా ఉద్యోగం సంపాదించుకున్నారు. అప్పటివరకు మోడ్రన్‌ డ్రెస్సుల్లో కనిపించిన ఎయిర్‌ హోస్టెస్‌లు సంప్రదాయమైన చీరలు కట్టుకోవాలని ఎయిర్‌లైన్స్‌ సంస్థ కొత్త రూల్‌ పాస్‌ చేసింది. చీరలో ఎంతో అందంగా కనిపించే కాంచన ఎయిర్‌ హోస్టెస్‌ అనే జాబ్‌కి కొత్త అందాన్ని తీసుకొచ్చారు. ఫ్లైట్‌లో ప్రయాణించిన కొందరు బాలీవుడ్‌ దర్శకనిర్మాతలు కాంచనకు సినిమాల్లో అవకాశాలు ఇస్తామన్నారు. కానీ, ఆమె అంగీకరించలేదు. ఆ తర్వాత ఫ్లైట్‌లోనే కాంచనను చూసి తమిళ దర్శకుడు శ్రీధర్‌ ఆమెను ఒప్పించి ‘ప్రేమించి చూడు’ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. అప్పుడే ఆమె పేరును కాంచనగా మార్చారు దర్శకుడు శ్రీధర్‌. అంతకుముందు బాలనటిగా చాలా సినిమాల్లో నటించిన కాంచన హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా అదే. అయితే ‘వీరాభిమన్యు’ చిత్రం ముందుగా విడుదలైంది. ఆ తర్వాత పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో తన అందంతో, అభినయంతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నారు కాంచన. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 150కి పైగా సినిమాల్లో నటించారు. అప్పట్లో ఆమెను పెళ్ళి చేసుకోవాలని ఎంతో మంది హీరోలు ప్రయత్నించారు. కానీ, ఆమె మాత్రం పెళ్లికి దూరంగానే ఉన్నారు. ప్రస్తుతం 84 ఏళ్ళ వయసులో ఉన్న కాంచన ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నారు. 1980 వరకు ఆమె కెరీర్‌ ఎంతో ఉజ్వలంగా ఉంది. ఆ తర్వాత ఆమె జీవితంలో చీకట్లు కమ్ముకున్నాయి. కెరీర్‌ పరంగా, కుటుంబ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి తన తండ్రి నుంచి సంక్రమించిన కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని తిరుమల తిరుపతి దేవస్థానం, కొన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చేసి దైవసన్నిధిలో ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు కాంచన. ఆమె అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఆమెకు ఎదురైన ఇబ్బందులు ఏమిటి? అనే విషయాలను ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడిరచారు కాంచన.  ‘నా చిన్నతనంలో మా ఇంట్లో లక్ష్మీ తాండవం అడేది. నాన్న అప్పుల పాలవ్వడంతో ఆస్తి కరిగిపోయింది. ఆ సమయంలోనే ఎయిర్‌హోస్టెస్‌గా జాయిన్‌ అయ్యాను. నెలకు రూ.600 జీతం ఇచ్చేవారు. తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఎన్నో సినిమాల్లో నటించాను. దాదాపు 15 సంవత్సరాలు సినిమాల కోసమే పరుగులు తీశాను. చివరికి ఒంటరిదాన్ని అయిపోయాను. నా తల్లిదండ్రులు.. మా పిన్ని కొడుకుని బాగా నమ్మారు. వాడు చెప్పినట్లు అమ్మానాన్న ఆడేవారు. నేను సంపాదించిన ఆస్తి మొత్తం దక్కించుకోవాలని చూశాడు వాడు. ఇప్పటికే నేను సంపాదించిన దాంట్లో చాలా వరకు వాడేసుకున్నాడు. ఇవన్నీ భరించలేక 1996లో ఆ ఇంటి నుంచి వచ్చేశాను. మా అమ్మ, నాన్న కూడా నాకు వ్యతిరేకంగా మారిపోయారు. వాడిని నమ్మి నన్ను మోసం చేశారు. ఎన్నో ఏళ్ళుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను. జీవితంలో నాకంటూ ఎవరూ లేరనే బాధ నాకు లేదు. ఎందుకంటే నాకు భగవంతుడు తోడున్నాడు.  ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో కూడా పెద్దవారిని, ఎన్నో సినిమాల్లో నటించిన ఒక ఆర్టిస్టుని గౌరవించడం లేదు. పైగా అవమానిస్తున్నారు. ‘బాహుబలి’ చిత్రంలో ఒక చిన్న క్యారెక్టర్‌ చేయమని అడిగేందుకు రాజమౌళి వచ్చారు. రెండు రోజుల క్యారెక్టర్‌ చెయ్యాలని చెప్పారు. నేను దానికి రూ.5 లక్షలు అడిగాను. అయితే అంత ఇచ్చుకోలేమని, వేలల్లో ఇవ్వగలమని అన్నారు. నాకు చాలా బాధ కలిగింది. సినిమాలో క్యారెక్టర్‌ ఇస్తానని చెప్పి నన్ను అలా అవమానించడం సరికాదు అనిపించింది. నా ఆస్తినంతా టెంపుల్‌కే ఇచ్చేశాను. నాకు డబ్బుతో పనేముంది. ఎన్నో సేవలు చేస్తున్నాను. వాళ్ళు ఇచ్చే డబ్బును కూడా సేవ కోసమే వినియోగిస్తాను. రాజమౌళి లాంటి వారికి రూ.5 లక్షలు ఒక లెక్కా. పైగా నన్ను అవమానించినట్టు కూడా మాట్లాడారు. నేను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని చాలా మంది చెప్పుకుంటున్నారు. కానీ, అలాంటిది ఏమీ లేదు. ఆర్థికంగా బాగానే ఉన్నాను. దైవసన్నిధిలో సేవ చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నాను’ అన్నారు కాంచన.

నేను కూడా పుష్ఫ గానే వస్తున్నా..రెడీగా ఉండండి

Publish Date:May 10, 2024

మీ అందరి కోసం పుష్ప గా వస్తున్నా.. నిజంగా  మీ అందరి కోసమే  పుష్పగా వస్తున్నాను. నాకు  మీ బ్లేసెస్ కావాలి   ఇప్పుడు ఈ మాటలని అంటుంది అల్లాటప్పా వ్యక్తి కాదు. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టిన హ్యూమా ఖురేషి.  పైగా రజనీ కాంత్ తో కాలా కూడా చేసింది. ఇంతకీ తను ఏం చెప్తుందో చూద్దాం జాలీ ఎల్ఎల్ బి.. 2013 లో బాలీవుడ్ లో వచ్చిన ఈ   కామెడీ అండ్ క్రైమ్ మూవీ  మంచి విజయాన్ని సాధించింది. క్రైమ్ అనే పేరు గాని ఎక్కువ భాగం కామెడీ నే ప్రధాన అంశంగా తెరకెక్కింది. ఆ తర్వాత  పార్ట్ 2 కూడా వచ్చింది. 2017 లో రాగా స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా చేసాడు. ఆయన భార్య పుష్పా పాండే పాత్రలో  హ్యూమా ఖురేషి నవ్వులని పూయించింది. ఇప్పుడు జాలీ ఎల్ ఎల్ బి పార్ట్ 3 లో కూడా  ఖురేషి నటించబోతుంది. పైగా తన పుష్పా క్యారక్టర్ యధాతధంగా ఉండబోతుంది. ఈ విషయాన్ని తన ఇనిస్టా వేదికగా ఖురేషి నే  వెల్లడి చేసింది ఇక  జాలీ ఎల్ ఎల్ బి పార్ట్ 3  షూటింగ్  ఇటీవలే  ప్రారంభం అయ్యింది. అక్షయ్ కుమార్ నే పార్ట్ 3 లో హీరోగా చేస్తున్నాడు   మున్నాభాయ్ ఎమ్ బి బి ఎస్ ఫేమ్ అర్షద్ వర్సి ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. కోర్ట్ డ్రామా గా తెరకెక్కతున్న ఈ కథలో వాళ్ళిద్దరి అల్లరి ఈ మేర ఉంటుందో చూడాలి. సుభాష్ కపూర్ దర్శకత్వం వహిస్తున్నాడు. జాలీ ఎల్ ఎల్ బి  2  తెలుగులో కూడా రీమేక్ అయ్యింది. కామెడీ నటుడు సప్తగిరి హీరోగా సప్తగిరి ఎల్ ఎల్ బి గా వచ్చింది.  

Salman Khan latest film gets Disastrous Day 1 with Flop Talk?

Publish Date:Apr 22, 2023

After a hiatus of four years, Salman Khan marked his return to the silver screen on Eid with a family entertainer titled Kisi Ka Bhai Kisi Ki Jaan. The film's opening day witnessed some negative response among the masses. However, it failed to create the same buzz among multiplex audiences. Its reviews have not been encouraging either.   The film rakes only 12 Crores on its first day, which falls short of the staggering amounts earned by the actor's previous Eid releases. The collection of its opening day is even lower than Khan’s previous flops like Bharat, Race 3 and Tubelight.   It appears that the audience took the film for granted, just as the makers and Salman Khan did. In the past, Salman Khan has been known to release his films on the occasion of Eid, with 10 of his movies having been released on this auspicious day. The film is likely to become biggest disaster in Salman Khan's career.

కిన్నెర మొగులయ్యకు జగతి ఆర్ధిక సాయం.. దమ్ముంటే వైరల్ చేయండి

Publish Date:May 10, 2024

  గుప్పెడంత మనసు సీరియల్ నటి జగతి మేడం  అలియాస్ జ్యోతి పూర్వజ్ ప్రైవేట్ వీడియోస్ సోషల్ మీడియాలో కొంత మంది పని గట్టుకుని లీక్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోకి టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా ఇప్పుడు ఆమె తన మంచితనాన్ని ప్రదర్శించింది. ఆమె  కిన్నెర మొగులయ్యకు ఆర్ధిక  సాయాన్ని అందించారు. ఆ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు.  "అక్షయ తృతీయ పర్వదినాన, ఎంతో  కీర్తి ప్రతిష్టలు ఉన్నప్పటికీ, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న పద్మశ్రీ కిన్నెర మొగలయ్య గారికి నేను ₹50,000 ఆర్థిక సహాయం అందించాను. ఆయన ఒక రకంగా బాధపడుతున్నారు. నేను అలాంటి బాధను అనుభవిస్తున్నాను. అందుకే ఆయన బాధ నా మనసును కదిలించింది.  ఎలాగైనా ఆయన్ని చేరుకొని ఆయనతో కలిసి ఒక పూట భోజనం చేసే అదృష్టాన్ని దక్కించుకుని నా మనసులో బాధను పోగొట్టుకున్నాను. అలాగే ఆయనలోని కళను సపోర్ట్ చేయాలనిపించింది.  అందుకే నాకు తోచినంత సాయం చేసాను. మీకు కూడా ఆయన కళను ప్రోత్సహించాలని ఉంటే , ఆయనకు సాయం చేయాలి అనుకుంటే  ముందుకు రండి కలిసి చేద్దాం" అని ఒక సుదీర్ఘ మెసేజ్ ని పోస్ట్ చేసింది. అలాగే ఈ ట్రోలర్స్ కి కూడా ఒక ఘాటు మెసేజ్ ఇచ్చింది.  "ఇప్పుడు ఈ వీడియోను వైరల్ చేసే ధైర్యం మీకు ఉందా ? ఇది జెన్యూన్ వీడియో..ఈ మాట ఎందుకన్నాను అంటే ఉద్యోగం, సద్యోగం లేక చదువుకుని చిల్లరగా టైం పాస్ చేసే వాళ్ళ కోసమే ఇది..మీరు నన్ను ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా , నన్ను చీకట్లోకి తోసేసినా..భయపడను మరింతగా ప్రకాశిస్తూ పైపైకి వస్తాను. ఫీనిక్స్ పక్షిలా నేను ఎప్పుడూ పాజిటివ్ మైండ్ తోనే ఉంటాను." అంటూ పోస్ట్ చేసింది జగతి మేడం  అలియాస్ జ్యోతి పూర్వజ్..  

చిరంజీవి 'విశ్వంభర'లో పవన్ కళ్యాణ్!

Publish Date:May 6, 2024

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కలిసి నటిస్తే చూడాలనేది మెగా అభిమానుల ఆశ. ఈ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకుంటే.. బాక్సాఫీస్ షేక్ అవుతుంది అనడంలో సందేహం లేదు. అయితే త్వరలోనే చిరంజీవి, పవన్ కళ్యాణ్ తెరను పంచుకొని, అభిమానులను ఖుషీ చేసే అవకాశముందని తెలుస్తోంది. చిరంజీవి కథానాయకుడిగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'విశ్వంభర' (Vishwambhara) . యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ లో త్రిష కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా 2025, జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అతిథి పాత్రలో మెరవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిడివి తక్కువైనప్పటికీ, కథని మలుపు తిప్పే కీలక పాత్ర కావడంతో.. పవన్ ని రంగంలోకి దింపుతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజమైతే మాత్రం, వచ్చే సంక్రాంతికి థియేటర్లలో అసలుసిసలైన మెగా మాస్ జాతర చూస్తాం అనడంలో డౌట్ లేదు. కాగా, గతంలో చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'శంకర్ దాదా జిందాబాద్' చిత్రంలో పవన్ ఒక పాటలో సందడి చేశారు.

Sudha Kongara & Hombale project is going to be Biggest Multistarrer

Publish Date:Jul 12, 2022

Even though it came before 'KGF,' Hombale Films became well-known with that film. The films are being announced, completed, and ready for release as a result of the momentum created by that film. Production is currently working on 'Salaar' in Telugu and 'Tyson' in Malayalam. Other pan-India films have also just been announced.   However, a film directed by Sudha Kongara was recently announced. Except for the fact that they stated that it will be a big film, they did not mention the casting. There are some new rumours floating around about this. If those rumours are true, this combination will be spectacular. According to sources, Sudha Kongara project is going to be multi starrer.  Furthermore, the names of those heroes are currently being spread.   According to the latest rumours, this film would star Suriya and Dulquer Salman, who have established as star heroes in the South with a string of superhits. According to industry reports, Surya, who has become acquainted of Sudha Kongara's direction in 'Akaasham Nee Haddura,' responded OK without even hearing the story. It is stated that discussions about this film are ongoing, and that full details will be released soon. Pre-production work will begin soon.   Hombale is synonymous with big-budget films. This film is expected to be in the same budget range as the previous one. Suriya's film is also popular in Telugu. Dulquer films have a cult following in the South. This combination is surely going to be crazy.

Ranbir and Alia in love

Publish Date:May 10, 2018

Operation Valentine

Publish Date:Mar 1, 2024

KGF Chapter 2

Publish Date:Apr 14, 2022

RRR

Publish Date:Mar 25, 2022

Radhe Shyam

Publish Date:Mar 11, 2022

Clap

Publish Date:Mar 11, 2022