Read more!

English | Telugu

అమితాబ్ దగ్గర 50 కోట్లు విలువ చేసే ఇల్లుని కొట్టేసిన కూతురు!

ఎవరికైనా తమ పిల్లలంటే చాలా ప్రేమ ఉంటుంది. కానీ సినిమా వాళ్ళకి మాత్రం ఇంకొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఈ మాట నిజమనే విషయం చాలా సార్లు నిరూపితమైంది. తమ చెల్లెళ్లకి, కూతుళ్ళకి,కొడుకులుకి పెళ్లిళ్లు చేసి తమ బాధ్యత తీర్చుకున్న తర్వాత కూడా వాళ్ళ మంచి చెడ్డల్ని చూసుకుంటూ  వాళ్ళకి ఖరీదయిన కానుకలని ఆస్తులని ఇస్తుంటారు. తాజాగా ఈ కోవలో  బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేరారు. తన కూతురికి చాలా  ఖరీదయిన ప్రాపర్టీ ని గిఫ్ట్ గా ఇచ్చి టాక్ అఫ్ ది డే గా నిలిచారు.

అమితాబ్ కి కొడుకు అభిషేక్ తో పాటు శ్వేతా అనే ఒక కూతురు ఉంది. శ్వేతా కి చాలా సంవత్సరంల క్రితమే వివాహం అయ్యి పెళ్లీడుకొచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. ఇక అసలు విషయానికి వస్తే అమితాబ్ కి ముంబై లో జై జుహు అనే  ఒక ఖరీదైన ఏరియాలో  ఒక ఫ్లాట్ ఉంది. దాని పేరు ప్రతీక్ష. దీని విలువ సుమారు 50 కోట్లు దాకా ఉంటుంది. ఇప్పుడు ఇంత ఖరీదైన ఇల్లుని అమితాబ్ తన కూతురు శ్వేతకి రాసి ఇచ్చాడు. అమితాబ్ కి ఎంతో ఇష్టమైన ఈ ఇంట్లోనే గతంలో అభిషేక్ ఐశ్వర్య ల వివాహం జరిగింది.

కాగా అమితాబ్ తన 80 ఏళ్ళ వయసులో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటూ అటు హిందీతో పాటు పలు బాషలకి చెందిన  చిత్రాల్లో నటిస్తు ఉన్నారు. అలాగే  కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాం కి హోస్ట్ గాను వ్యవహరిస్తు ఇప్పటి హీరోలకి సవాలు విసురుతున్నాడు.