Read more!

English | Telugu

జనం విమానాలు ఎక్కడం లేదు  కాబట్టే మా సినిమా ప్లాప్ అయ్యింది

బాలీవుడ్ సూపర్ స్టార్  హృతిక్ రోషన్ హీరోగా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన చిత్రం ఫైటర్. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరాజయం దిశగా దూసుకెళ్తున్న ఫైటర్ ప్రేక్షకులకి నచ్చకపోవడానికి గల కారణాలని ఆ చిత్ర దర్శకుడు చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

 ఫైటర్ ని ప్రముఖ బాలీవుడ్ అగ్ర  దర్శకుడైన సిద్దార్థ్ ఆనంద్ అత్యంత భారీ వ్యయప్రయాసలకి ఓర్చి తెరకెక్కించాడు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు  మన దేశంలో ఏవియేషన్  కోర్స్ ని చదివిన వాళ్ళు చాలా తక్కువ  మంది ఉంటారు. చాలా మందికి  పాస్‌పోర్ట్ కూడా లేదు. అలాగే  90 శాతం మంది  విమానాల్లో ప్రయాణించడం గాని కనీసం     విమానాశ్రయాలకు వెళ్లడం గాని చెయ్యలేదు. సో ప్రేక్షకులు  మా ఫైటర్ ని ఆదరించకపోవడానికి కారణం ఇదే అని  చెప్పాడు. ఈ మూవీ లో హృతిక్ అండ్ దీపికా లు విమానాన్ని నడిపే పైలెట్స్ గా నటించారు. 

హృతిక్ సరసన దీపికా పదుకొనే నటించిన ఫైటర్ ని  అజిత్ అందరే, అంకు పాండే, రామన్ చిబ్ లు అత్యంత భారీ వ్యయంతో నిర్మించారు. ఓపెనింగ్ కలెక్షన్స్ బాగానే వచ్చినపప్పటకి ప్లాప్ టాక్ వల్ల  వీక్ డేస్ లో సినిమా వసూళ్లు భారీగా పడిపోయాయి. లాంగ్ రన్ లో ఈ సినిమా 200 కోట్ల క్లబ్ లో చేరటం కూడా కష్టమని  ట్రేడ్ వర్గాలు  అంటున్నాయి. అనిల్ కపూర్ ముఖ్య పాత్రని పోషించాడు. సినిమాలో ఉన్న దేశ భక్తి మూలంగా అరబ్ కంట్రీ లో ఫైటర్ ని నిషేధించడం జరిగింది.