English | Telugu

అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ హిందీ రీమేక్.. దోస్తానా కాంబో!

మాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్.. ప‌లు భాష‌ల్లో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు రీమేక్ లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, ద‌గ్గుబాటి స్టార్ రానా ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కాగా, హిందీ వెర్ష‌న్ కి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే.. బాలీవుడ్ వెర్ష‌న్ లో అభిషేక్ బ‌చ్చ‌న్, జాన్ అబ్ర‌హ‌మ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్నార‌ని స‌మాచారం.

అదే గనుక నిజ‌మైతే.. ధూమ్, దోస్తానా వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ లో క‌ల‌సి న‌టించిన జాన్, అభిషేక్ కాంబో.. ఈ రీమేక్ కి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణగా నిలుస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. రీమేక్ రైట్స్ ని పొంద‌డ‌మే కాకుండా ప్ర‌ధాన పాత్ర‌లో జాన్ అబ్ర‌హ‌మ్ న‌టిస్తుండ‌డం హిందీనాట అంచ‌నాలు పెంచేస్తోంది. మ‌రి.. దోస్తానా త‌రువాత దాదాపు 13 ఏళ్ళ అనంత‌రం క‌ల‌సి న‌టించ‌బోతున్న జాన్, అభిషేక్.. ఈ రీమేక్ తో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ని త‌మ ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.