English | Telugu

దీపికా ప‌డుకోనే కార్ల క‌లెక్ష‌న్ చూస్తే.. వ్వావ్ అనాల్సిందే!

 

బాలీవుడ్‌లో అత్యంత పాపుల‌ర్ తార‌ల్లో దీపికా ప‌డుకోనే ఒక‌రు. చాలామంది ఆర్టిస్టులు క‌ల‌ల్లో మాత్ర‌మే ఊహించుకొనే చిత్రంతో ఆమె ప‌రిచ‌య‌మైంది. షారుఖ్ ఖాన్ స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టించిన 'ఓం శాంతి ఓం' సినిమాతో ఆమె బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అప్ప‌ట్నుంచీ ఆమె ఆక‌ర్ష‌ణీయ‌మైన స్క్రీన్ ప్రెజెన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతూనే ఉన్నారు.

దీపిక ఇప్పుడు బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే స్టార్స్‌లో ఒకరు. కాబట్టి ఆమె షూస్‌, బ్యాగ్స్ మాత్రమే కాకుండా ఆక‌ర్ష‌ణీయ‌మైన‌, ఖ‌రీదైన కార్ల క‌లెక్ష‌న్ కలిగి ఉండటం ఆశ్చర్యం కలిగించదు! ఆమె కార్ల క‌లెక్ష‌న్ చూసి నోరెళ్ల‌బెట్టాల్సిందే.

ఆమె జర్మన్ తయారీదారుల ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీని కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేసింది. ఇది దీపికా పడుకోనే త‌న కోసం కొనుక్కున్న‌ మొట్టమొదటి విలాసవంతమైన కారు. 7 సీట్ల ఈ ఎస్‌యూవీ ధర 70 నుంచి 80 లక్షల రూపాయ‌ల‌ మధ్య ఉంటుంది.

దీపికా ద‌గ్గ‌ర‌ ఎలక్ట్రిక్ బ్లూ మినీ క్యాబ్రియో ఉంది. దీన్ని వైట్ ఇంటీరియర్స్‌తో డిజైన్ చేయించుకుంది. ఈ కారు ఒక వేరియంట్‌లో లభించినప్పటికీ, ఇది 2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 189 బిహెచ్‌పి, 280 ఎన్‌ఎమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. మినీ కూపర్ కన్వర్టిబుల్‌ ప్రారంభ ధర రూ. 33.10 లక్షలు.

దీపిక ద‌గ్గ‌రున్న వాటిలో మెర్సిడెస్ మేబాచ్ ఎస్500 అత్యంత విలాసవంతమైన కారు. ఆమె ఈ ఫాన్సీ వెహిక‌ల్‌లోనే ఎక్కువ‌గా తిరుగుతూ కనిపిస్తుంది. మేబాచ్ ఎస్500 4.7-లీటర్ ఇంజన్ నుండి శక్తిని ఆకర్షిస్తుంది. ఇది గరిష్టంగా 459 బిహెచ్‌పి శక్తిని 700 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్ తో సృష్టిస్తుంది. ఈ కారు ధర రూ. 1.94 కోట్లు.

మెర్సిడెస్ మేబాచ్ ఎస్500 కొనడానికి ముందు, దీపికా ఎక్కువ‌గా తన ముదురు నీలం ఆడి ఎ8ఎల్ లో తరచుగా బ‌య‌ట క‌నిపిస్తూ ఉండేది. ఆమెకు అత్యంత ఇష్టమైన రైడ్లలో ఈ ల‌గ్జ‌రీ రైడ్‌ ఒకటి. ఆడి ఎ8ఎల్ రెండు వేరియంట్లలో ల‌భిస్తుంది. ఒక‌టి 3-లీటర్ వి6 డీజిల్ అయితే, ఇంకొక‌టి 4.2-లీటర్ వి8 డీజిల్. దీని బేస్ ప్రైస్‌ (ఎక్స్-షోరూమ్) రూ. 1.18 కోట్లు.