Read more!

English | Telugu

ఒక్క ఛాన్స్ ఇవ్వమంటున్న రణ్‌వీర్‌!

కాఫీ విత్‌ కరణ్‌ షో సంగతేమోగానీ, అందరికీ రణ్‌బీర్‌, దీపిక పదుకోన్‌ మీద ఇంట్రస్ట్ అమాంతం పెరిగిపోయింది. వారిద్దరూ విడిపోతున్నారంటూ ఆ మధ్య తెగ వార్తలు వైరల్‌ అయ్యాయి. అయితే తూచ్‌.. అలాంటిదేమీ లేదంటూ చెప్పకనే చెప్పేసింది కాఫీ విత్‌ కరణ్‌ షో. ఈ షోలో దీపిక చెప్పిన విషయాల కన్నా, రణ్‌వీర్‌ ఆ ఒక్క ఛాన్స్ అడిగిన తీరు మాత్రం జనాలు తెగ అట్రాక్ట్ చేసింది.

డాన్‌3కి మీరు కరెక్ట్ ఛాయిస్‌ కారు అని చాలా మంది అనుకుంటున్నారు. వారికి మీరిచ్చే ఆన్సర్‌ ఏంటి అని కరణ్‌ జోహార్‌ అడిగారు రణ్‌వీర్‌ సింగ్‌ని. ఫర్హాన్‌ అక్తర్‌ డైరక్ట్ చేస్తున్న సినిమా డాన్‌3. ఇదే కేరక్టర్‌ని గతంలో అమితాబ్‌ చేశారు. ఆ తర్వాత షారుఖ్‌ ఖాన్‌ చేశారు. ఇప్పుడు థర్డ్ జనరేషన్‌ హీరోగా రణ్‌వీర్‌ సింగ్‌ డాన్‌ కేరక్టర్‌ని పోట్రే  చేయబోతున్నారు. ఈ విషయాన్ని గురించే అడిగారు కరణ్‌ జోహార్‌.

కరణ్‌ అడిగిన ప్రశ్న కన్నా, రణ్‌వీర్‌ చెప్పిన సమాధానం జనాలను మెస్మరైజ్‌ చేస్తోంది. ''ఏక్‌ ఛాన్స్ దేదో, 12 - 13 సాల్‌ మే తిక్‌ తాక్‌ హి కామ్‌ కియా హే మైనే. తో ఏక్‌ మౌకా తో బంతా హై (నాకో ఛాన్స్ ఇవ్వండి. దాదాపు 12 - 13 ఏళ్లుగా నా రంగంలో డీసెంట్‌గా పనిచేస్తూ, మెప్పిస్తున్నా. అందుకే ఓ ఛాన్స్ ఇవ్వమంటున్నా) అంటూ అడిగారు.

రణ్‌వీర్‌ అడిగిన తీరుకు ఏక్‌దమ్‌ ఫిదా అయిపోయామంటున్నారు దీప్‌వీర్‌ ఫ్యాన్స్. ఈ సినిమా షూటింగ్‌ 2025లో సెట్స్ మీదకు వెళ్లనుంది. గతంలో అమితాబ్‌ చేసిన పాత్రకు షారుఖ్‌ సెలక్ట్ అయినప్పుడు కూడా జనాలు ఇలాగే మాట్లాడారట. ఇప్పుడు సేమ్‌ రిపీట్‌ అవుతోంది. కానీ, స్క్రీన్‌ మీద మ్యాజిక్‌ చూసిన వారందరూ దీన్ని చాలా త్వరగా మర్చిపోతారు అని అంటున్నారు క్రిటిక్స్. అద్భుతమైన కథలతో, అబ్బురపరిచే యాక్షన్‌తో డాన్‌ కథలు ఎప్పుడూ జనాలను అలరిస్తూనే ఉన్నాయన్నది ఫ్యాక్ట్. 2011లో విడుదలైన డాన్‌2లో హృతిక్‌ రోషన్‌ గెస్ట్ రోల్‌ చేశారు. ఇప్పుడు 2025లో స్టార్ట్ అయ్యే డాన్‌3లో ఎవరైనా గెస్ట్ రోల్‌ చేస్తారా? షారుఖ్‌గానీ, హృతిక్‌గానీ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అలాంటి సస్పెన్స్‌లను డైరక్టర్, ప్రొడ్యూసర్‌ ప్లాన్‌ చేస్తే, ప్రాజెక్ట్ కి క్రేజ్‌ ఇంకో రేంజ్‌లో ఉంటుందని అంటున్నారు దీప్‌వీర్‌ ఫ్యాన్స్.