Read more!

English | Telugu

అయోధ్య కోసం కథ సిద్ధం చేసిన కంగన!

కంగన రనౌత్‌ ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడినా సెన్సేషన్‌ అవుతుంది. అందుకే ఫైర్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ ఉంది ఆమెకి. నార్త్ వాళ్లు సౌత్‌ని కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేయడానికి ముందే, సౌత్‌ మీద తన ప్యార్‌ని ఓపెన్‌గా ప్రకటించేసిన బ్యూటీ కంగనా రనౌత్‌. ప్రస్తుతం తేజాస్‌ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లోనూ, రిలీజ్‌ హడావిడిలోనూ ఉన్నారు కంగనా రనౌత్‌. తేజాస్‌ని ఆమె ఫస్ట్ ఏరియల్‌ యాక్షన్‌ సినిమాగా ప్రమోట్‌ చేస్తున్నారు. అక్టోబర్‌ 27న స్క్రీన్స్ మీదకు రానుంది తేజాస్‌. ఈ సినిమా విడుదలకు  ముందు ఆమె అయోధ్య రామ మందిరాన్ని సందర్శించారు. రాముడి ఆశీస్సులు తీసుకున్న కంగన చాలా విషయాలను మీడియాతో పంచుకున్నారు.

అయోధ్య రామాలయం గురించి మాట్లాడుతూ ''అయోధ్య గురించి సినిమా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. స్క్రిప్ట్ పరంగా చాలా ప్రోగ్రెసివ్‌గా ఉన్నాను. ఆలయ గాథను అద్భుతంగా స్క్రిప్ట్ చేశాను. రామ్‌ మందిర్‌ నా సినిమాలో చాలా ఇంపార్టెంట్‌ రోల్‌ ప్లే చేస్తుంది. తేజాస్‌ సినిమాలోనూ రామ్‌ మందిరానికి చాలా మంచి ప్రాముఖ్యత ఉంది. క్రైస్తవులకు వాటికన్‌ సిటీ ఎలాగో, హిందువులకు అయోధ్య అలాంటింది. మన సనాతన ధర్మానికి అద్భుతమైన ప్రతీక రామ మందిరం. 600 ఏళ్ల పోరాటం తర్వాత ఇవాళ గర్వంగా రామ మందిరం గురించి  మాట్లాడుకోవడం ఆనందంగా ఉంది'' అని అన్నారు.

ఈ ఏడాది దసరాకు ఢిల్లీలో రావణ్‌ దహన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు కంగనా రనౌత్‌. మామూలుగా రెడ్‌ ఫోర్ట్ లో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి పాల్గొంటారు. కానీ ఈ సారి పీఎం బిజీగా ఉండటంతో పలు రంగాల్లో రాణిస్తున్న మహిళలకు ఆ అవకాశం కల్పించారు. అలా కంగనా రనౌత్‌కి ఈ అవకాశం దక్కింది. పండగ రోజు అంత గొప్ప అవకాశం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కంగనా రనౌత్‌.