English | Telugu
శృంగారంపై చేసిన వ్యాఖ్యలతో బోనికపూర్ ఆగ్రహం
Updated : Feb 13, 2025
శ్రీదేవి(Sridevi)భర్త బోనికపూర్(Boni kapoor)గురించి సినీ ప్రేమికులకి ప్రత్యేక పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు.కేవలం శ్రీదేవి భర్త అనే టాగ్ లైనే కాకుండా నిర్మాతగాను ఎన్నో హిట్ సినిమాలని ఇండియన్ సినిమా ప్రేక్షకులకి అందించాడు.పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ కి కూడా సమర్పుకుడిగా వ్యవహరించాడు.రీసెంట్ గా యూ ట్యూబర్ రణవీర్ అలహాబాదియా 'ఇండియాస్ గాట్ లాటెంట్' వేదికగా ఒక కంటెస్ట్ తో అతని తల్లితండ్రులు గురించి,శృంగారం గురించి కొన్ని ప్రశ్నలు వేసాడు.
ఇప్పుడు ఆ వ్యాఖ్యలపై బోనికపూర్ మాట్లాడుతు అలాంటి వ్యాఖ్యలని ఎవరు కూడా ఉపేక్షించకూడదు.సినిమాలకి ఎలా అయితే సెన్సార్ ఉంటుందో,ఏదైనా ఒక విషయం మీద మాట్లాడేప్పుడు దాని గురించి మాట్లాడాలా లేదా అని అందరు ఆలోచించుకోవాలి.ఇంట్లో ఉన్నపుడు నీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడు.కానీ బయట కొచ్చి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా
మాట్లాడుతు హుందాగా వ్యవహరించాలని చెప్పుకొచ్చాడు.
ఇక రణవీర్ విషయంపై ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు.'మహారాష్ట్ర'తో పాటు 'అసోం'లాంటి ఏరియాల్లో కూడా రణవీర్ పై కేసులు కూడా నమోదయ్యాయి.దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో రణవీర్ మాట్లాడుతు నేను పబ్లిసిటీ కోసం ఆ కార్యక్రమాన్ని నిర్వహించలేదు.నా వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయనేది నిజం.నన్ను క్షమించండని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.