English | Telugu

రైతులు సినిమా షూటింగ్‌ని ఆపేశారు!

కేంద్రం తీసుకువ‌స్తున్న సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు ఢిల్లీ కేంద్రంగా భారీ ఉద్య‌మం చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. దాని సెగ ఓ సినిమా షూటింగ్‌కు త‌గిలింది. పంజాబ్‌లోని పాటియాలాలో జరుగుతున్న 'ల‌వ్ హాస్ట‌ల్' అనే సినిమా షూటింగ్‌ను ఓ రైతుల బృందం అడ్డుకుంది. ఈ మూవీలో బాబీ డియోల్ ప్ర‌ధాన పాత్ర‌ధారి. ఈ ఘ‌ట‌న శుక్ర‌వారం చోటు చేసుకుంది. పాటియాలా జిల్లాలోని దేవిగ‌ఢ్ ద‌గ్గ‌ర మెహోన్ విలేజ్‌లోని ఓ ఇంట్లో ఆ సినిమా షూటింగ్‌ను నిర్వ‌హిస్తున్నారు.

దాదాపు 150 నుంచి 200 మంది రైతులు అక్క‌డ గుమికూడి షూటింగ్‌ను అడ్డుకున్నార‌ని జుల్క‌న్ పోలీస్ స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ హ‌ర్మ‌న్‌ప్రీత్ సింగ్ తెలిపారు. బాబీ డియోల్ కుటుంబ స‌భ్యుల్లో ఏ ఒక్క‌రూ రైతుల ఉద్య‌మానికి మ‌ద్ద‌తుగా మాట్లాడ‌లేద‌ని ఆరోపిస్తూ, ఆ రైతులు షూటింగ్‌ను ఆపేశారు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన టైమ్‌లో బాబీ డియోల్ అక్క‌డ లేడు. విక్రాంత్ మాసే, సాన్యా మ‌ల్హోత్రా 'ల‌వ్ హాస్ట‌ల్‌'లో జంట‌గా న‌టిస్తున్నారు.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.