English | Telugu
హీరోయిన్,ఆమె భర్తకి తగిన శాస్తి జరిగింది..వారి పట్ల అప్రమత్తంగా ఉండండి
Updated : Mar 3, 2025
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu)నుంచి వచ్చిన పలు హిట్ సినిమాల్లో 'టక్కరి దొంగ'(Takkari Donga)ఒకటి.2002 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన బాలీవుడ్ నటి బిపాషా బసు(Bipasha Basu).ఆ తర్వాత హిందీలో ఎన్నో హిట్ చిత్రాలు చేసిన బిపాషా 2015 లో ప్రముఖ సినీ,టీవీ నటుడు 'కరణ్ సింగ్ గ్రోవర్' ని వివాహం చేసుకుంది.ఈ ఇద్దరు కలిసి 'డేంజరస్'(Dangerous)అనే వెబ్ సిరీస్ లో నటించగా, ప్రముఖ గాయకుడు,నటుడైన 'మికాసింగ్'(MIka singh)వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు.
ఆయన ఇటివల మాట్లాడుతు బిపాషాబసు, ఆమె భర్త వల్లే 4 కోట్ల బడ్జెట్ తో కంప్లీట్ అవ్వాల్సిన డేంజరస్ కి 14 కోట్ల ఖర్చు అయ్యిందని,ఆ ఇద్దరు నాకు చేసిన అన్యాయం వల్లే వాళ్ళకి ఇప్పుడు పని లేకపోయిందని చెప్పుకొచ్చాడు .ఈ విషయంపై రీసెంట్ గా బిపాషా బసు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తు'విషపూరితమైన వ్యక్తులు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తారు.తప్పుఏదైనా సరే నిందలు మాత్రం ఎదుటి వ్యక్తులపై వేస్తారు.కానీ తప్పుకి బాధ్యత వహించరు.అలాంటి వారి పట్ల జాగ్రతగా ఉండండి.ఆ భగవంతుడి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలంటూ ఇనిస్టాగ్రమ్ వేదికగా షేర్ చేసింది.
రాజ్,రాజ్ 3 ,బర్సాత్,నో ఎంట్రీ, శిఖర్,కార్పొరేట్,ధూమ్ 2 ,రేస్, రేస్ 2 ,రుద్రాక్ష్, గోయల్,ఓంకార ఇలా సుమారు 45 సినిమాల దాకా నటించిన బిపాసా హిందీ చిత్ర రంగంలో తనదైన ముద్ర వేసింది.ప్రస్తుతానికి ఆమె చేతిలో ఎలాంటి సినిమాలు లేవు.