English | Telugu
ప్రముఖ నటుడి అంత్యక్రియలని జరిపించిన యానిమల్
Updated : Mar 15, 2025
'యానిమల్'(Animal)తో సంచలన విజయాన్ని అందుకున్న బాలీవుడ్ అగ్ర హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor)ప్రస్తుతం 'రామాయణ' మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు, ఆరాధ్య మాత'సీతమ్మతల్లి' జీవిత కథ ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుండగా సీతమ్మ తల్లిగా సాయిపల్లవి(Saipallavi)చేస్తుంది.నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నాడు.
రీసెంట్ గా బాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన అయాన్ ముఖర్జీ(Ayan Mukerji)తండ్రి ప్రముఖ నటుడు దేబ్ ముఖర్జీ(Deb Mukherjee)అనారోగ్యంతో ముంబైలో చనిపోవడం జరిగింది.ఈ మేరకు నిన్నఅంత్యక్రియలు జరగగా బాలీవుడ్ కి చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.రణబీర్ కూడా హాజరవడంతో పాటు దేబ్ ముఖర్జీ పార్థివదేహాన్ని ఉంచిన పాడే ని మొయ్యడం కూడా జరిగింది.పైగా అంత్యక్రియల కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించాడు.అయాన్, రణబీర్ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే.
అయాన్ ముఖర్జీ ప్రస్తుతం ఎన్టీఆర్(Ntr)హృతిక్ కాంబినేషన్ లో వార్ (War 2)ని తెరకెక్కిస్తున్నాడు.షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీపై పాన్ ఇండియా వ్యాప్తంగా అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.
