English | Telugu

గ్రాడ్యుయేట్ అయిన షారుఖ్ పెద్ద‌కొడుకు.. ఫొటో వైర‌ల్‌!

గ్రాడ్యుయేట్ అయిన షారుఖ్ పెద్ద‌కొడుకు.. ఫొటో వైర‌ల్‌!

 

షారుఖ్ ఖాన్ పెద్ద కొడుకు ఆర్య‌న్ ఖాన్ కొత్త ఫొటో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. అది ఆర్య‌న్ గ్రాడ్యుయేష‌న్ వేడుక‌కు సంబంధించింది. యూనివ‌ర్సిటీ ఆఫ్ స‌ద‌ర‌న్ కాలిఫోర్నియా నుంచి అత‌ను గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశాడు. ఆ ఫొటోలో యూనివ‌ర్సిటీలో జ‌రిగిన సెర్మ‌నీలో గ్రాడ్యుయేష‌న్ దుస్తుల్ని ధ‌రించి స‌ర్టిఫికెట్ అందుకొని, దాన్ని చేతిలో ప‌ట్టుకొన్న ఆర్య‌న్ మ‌న‌కు క‌నిపిస్తున్నాడు. 

మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో భౌతిక దూరం పాటిస్తూ యూనివ‌ర్సిటీ ఆఫ్ స‌ద‌ర‌న్ కాలిఫోర్నియాలో ఇటీవ‌ల గ్రాడ్యుయేష‌న్ సెర్మ‌నీ జ‌రిగింది. అక్క‌డ గ్రాడ్యుయేష‌న్ రోబ్ ధ‌రించిన ఆర్య‌న్ ఫొటోను ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు. ఆ ఫొటో కింద ఉన్న పేరును కూడా మ‌నం చూడొచ్చు. ఆర్య‌న్ షారుఖ్ ఖాన్ అంటూ దానిపై రాసుంది.

ఆర్య‌న్ బ్యాచిల‌ర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌, సినిమాటిక్ ఆర్ట్స్‌, ఫిల్మ్ అండ్ టెలివిజ‌న్ ప్రొడ‌క్ష‌న్‌లో బ్యాచిల‌ర్ డిగ్రీ పొందాడు. ఆ స్టార్ కిడ్‌కు కంగ్రాట్స్ చెబుతున్న మెసేజ్‌లతో ఫ్యాన్స్ సంద‌డి చేస్తున్నారు.

ఇప్ప‌టిదాకా తెర‌పై ఆర్య‌న్ ఖాన్ న‌టించ‌లేదు కానీ 'ద ల‌య‌న్ కింగ్' హిందీ వెర్ష‌న్‌కు త‌న వాయిస్‌ను ఇచ్చాడు. ఆ మూవీలో సింబా క్యారెక్ట‌ర్‌కు డ‌బ్బింగ్ చెప్పాడు ఆర్య‌న్‌. అదే మూవీలో ల‌య‌న్ కింగ్ ముఫాసా క్యారెక్ట‌ర్‌కు షారుఖ్ వాయిస్ ఇచ్చాడు. తండ్రీ కొడుకుల గొంతులు ఒకే ర‌కంగా ఉన్నాయ‌ని ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డ్డారు.

గ్రాడ్యుయేట్ అయిన షారుఖ్ పెద్ద‌కొడుకు.. ఫొటో వైర‌ల్‌!