English | Telugu

అమితాబ్ కి రెండు రోజులు నిద్ర లేదు..విమానం లాండింగ్ కి నో పర్మిషన్ 

ఇండియన్ చిత్ర సీమలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్(amitabh bachchan)సినీ ప్రస్థానానికి ఎప్పుడు కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఐదు దశాబ్దాల నుంచి నేటికీ యువ హీరోలకి ధీటుగా తనదైన నటనతో ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాడు. ప్రెజంట్ సూపర్ స్టార్ రజనీ కాంత్(rajinikanth)అప్ కమింగ్ మూవీ వెట్టియాన్ లో కూడా కీలక పాత్రలో చేస్తున్నాడు. రీసెంట్ గా సోషల్ మీడియా రెడ్ మీ వేదికగా గతంలో జరిగిన ఒక విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు.

2003 వ సంవత్సరం ఖాకీ సినిమా షూటింగ్ సమయంలో ఐశ్వర్య రాయ్(aishwarya rai)కి జరిగిన ప్రమాదాన్ని నా జీవితంలో మర్చిపోలేను.ఒక కారు అదుపు తప్పి చాలా వేగంగా వచ్చి ఐశ్వర్య కూర్చుని ఉన్న కుర్చీని ఢీ కొట్టడంతో ఐశ్వర్య కి చాలా బలమైన గాయాలు అయ్యాయి. దాంతో అనిల్ అంబానీ కి చెందిన విమానంలో ముంబై కి తీసుకెళ్లాలనుకున్నాం.నాసిక్ లో నైట్ లాండింగ్ సౌకర్యం లేనందున దగ్గరలో ఉన్న సైనిక స్థావరంలో లాండింగ్ చెయ్యడానికి ఢిల్లీ నుంచి అనుమతి తీసుకున్నాం.ఇక అప్పట్లో చాలా మంది ఐశ్వర్య గాయాల విషయాన్నీ చాలా చిన్న సంఘటనగా చూసారు, కానీ అసలు విషయం నాకు మాత్రమే తెలుసు. ఐశ్వర్య వీపు కాళ్ళకి చాలా బలమైన గాయాలు అయ్యాయి. పాదాల వెనుక భాగంలో ఎముక కూడా విరిగిపోయింది.ఆ సంఘటనని మర్చిపోవడానికి నాకు చాలా రోజులు పట్టింది.అసలు రెండు రోజులు నిద్ర కూడా పోలేదని అంటూ ఒకింత భావోద్వేగానికి గురయ్యాడు.

ఐశ్వర్య, అమితాబ్ లు ఖాకీ తో పాటుగా హమ్ కిసైస్ కమ్ నహి,మోహబతైన్, జోధా అక్బర్,బంటీ ఔర్ బబ్లీ, క్యూన్ హో గయానా, సర్కార్ రాజ్,పొన్నియన్ సెల్వం వంటి పలు చిత్రాల్లో చేసారు. ఐశ్వర్య 2007 లో అభిషేక్ బచ్చన్ ని వివాహం చేసుకుంది.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.