Read more!

English | Telugu

ఆలియాకు కంగ్రాట్స్ చెబుతున్న నెటిజ‌న్లు... రీజ‌న్ ఇదే!

2022 స్టార్టింగ్ నుంచీ కంగ్రాజులేష‌న్స్ మేడ‌మ్ అనే మాట వినీ వినీ విసుగొచ్చింది ఆలియాకు. ఈ ఇయ‌ర్ స్టార్టింగ్‌లో ట్రిపుల్ ఆర్‌, గంగూభాయ్ సినిమాల ప్ర‌మోష‌న్లు, రిలీజుల‌తో హ‌డావిడిగా గ‌డిపింది ఆలియా. ఆ త‌ర్వాత హాలీవుడ్ ప్రాజెక్టు. ఆ వెంట‌నే పెళ్లి, మ‌ళ్లీ హాలీవుడ్ ప్రాజెక్ట్ అంటూ క్ష‌ణం తీరిక లేదు.

మ‌ధ్య‌లో నిర్మాత‌గా ఓన్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ మొద‌లుపెట్టింది.. షారుఖ్‌తో క‌లిసి సినిమా నిర్మించింది. ఇప్పుడు ఆ సినిమాను సౌత్‌లోనూ నిర్మించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇవ‌న్నీ కాస్త కుదురుకునే లోపు ప్రెగ్నెన్సీ న్యూస్ అనౌన్స్ చేసింది. రీసెంట్‌గా ప్రెగ్నెన్సీ కాస్ట్యూమ్స్ డిజైనింగ్ వ్యాపారం మొద‌లుపెట్టింది. మ‌ధ్య‌లో బ్ర‌హ్మాస్త్ర సినిమా షూటింగులు, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌లు, రిలీజులు... వుఫ్ ఇక ఆలియాకు తీరిక ఎక్క‌డిదీ అంటున్నారా?

అంత బిజీలోనూ త‌ను హ్యాపీగా ఫీల‌య్యే విష‌యాలు చాలానే ఉన్నాయంటుంది ఆలియా. టైమ్స్ 100 ఇంపాక్ట్ అవార్డు అందుకోవ‌డం గ‌ర్వ‌కార‌ణం అని చెప్పింది. సింగ‌పూర్‌లో జ‌రిగిన ఈ అవార్డు వేడుక‌కు వెళ్లింది ఆలియా. ఆమె ధ‌రించిన డ్ర‌స్‌, బేబీ బంప్‌ను ఆమె క్యారీ చేసిన విధానం గురించి నెట్టింట స్పెష‌ల్‌గా మాట్లాడుకుంటున్నారు. ఆలియాను సొంత బిడ్డ‌లా చూసుకునే క‌ర‌ణ్ జోహార్ మూడు హార్ట్ ఎమోజీల‌తో ఆమెకు విషెస్ చెప్పారు. సోష‌ల్ మీడియా మొత్తం ఆమెకు కంగ్రాజులేష‌న్స్ మెసేజ్‌ల‌తో నిండిపోతోంది. ప్ర‌స్తుతం ప్రెగ్నెన్సీ డైరీస్‌ని ఎంజాయ్ చేస్తున్నాన‌ని అంటోంది ఆలియా.