English | Telugu

అరెరె... ఆలియాకు ఏమైంది?  థెర‌పీ ఎందుకు?

ఆలియా భ‌ట్ థెర‌పీకి వెళ్తున్నారు. ఇప్పుడు ఆమెకు థెర‌పీలు ఎందుకు? ఇంత‌కీ ఏమైంది? అనే ప్ర‌శ్న‌లు చుట్టుముట్ట‌కుండా అస‌లు విష‌యాన్ని ఓపెన్‌గానే చెప్పేశారు మిసెస్ ఆలియా ర‌ణ్‌బీర్ క‌పూర్‌.
ఓ వైపు కెరీర్‌, మ‌రోవైపు కొత్త‌గా మాతృత్వ బాధ్య‌త‌ల‌తో త‌ల‌మున‌క‌లై ఉన్నారు ఆలియా భట్‌. పాప‌ను చూసుకుంటూ న‌ట‌న‌ను బ్యాల‌న్స్ చేస్తూ త‌ను ప‌ర్ఫెక్ట్ గానే ఉన్నానా లేదా అని సెల్ఫ్ చెక్ చేసుకుంటున్నారు. దాంతో యాంగ్జియ‌స్‌కి గుర‌వుతున్నార‌ట‌. ``కొత్త‌గా త‌ల్ల‌యిన ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఒక ర‌క‌మైన కంగారు ఉంటుంది. బిడ్డ‌కి అన్నీ స‌క్ర‌మంగా చేస్తున్నామా లేదా అని భ‌యం ఉంటుంది. అందులోనూ ఉద్యోగాలు చేసేవారిలో అది ఇంకా ఎక్కువ ఉంటుంద‌ని నాకు అర్థ‌మైంది. స్టార్ స్టేట‌స్ నాకు బ‌య‌ట ఉన్న మాట వాస్త‌వ‌మే. కానీ నేను ఇంట్లో త‌ల్లిని. రెండింటినీ బ్యాల‌న్స్ చేసుకోవాలి. ఏమాత్రం స‌రిగా బ్యాల‌న్స్ చేసుకోలేక‌పోయినా, ప్ర‌జ‌లు నా గురించి ఏమ‌నుకుంటారోన‌నే భ‌యం ఉంటుంది.

అంత‌కు మించి స‌రిగా చేయాల‌నే బాధ్య‌త ఉంటుంది. దీనివ‌ల్ల్ స్ట్రెస్ పెరిగిపోతుంది. అందుకే నేను ప్ర‌తి వారం థెర‌పీకి వెళ్తున్నా. ఎవ‌రికైనా మెంట‌ల్ హెల్త్ చాలా ముఖ్యం. నేను థెర‌పీకి వెళ్తున్నంత మాత్రాన అంతా రాత్రికి రాత్రే స‌వ్యంగా మార‌దు. కానీ ముక్క‌లైన న‌న్ను ఏరుకుని మ‌నిషిగా నిల‌బెట్టుకోవ‌డానికి అది ప‌నికొస్తుంది. కాల‌క్ర‌మేణ అర్థ‌మ‌వుతూ ఉంటుంది. అవ‌గాహ‌న పెరిగేకొద్దీ మ‌నిషిలో కుదురు వ‌స్తుంది. ఏ ప్ర‌శ్న‌కీ ఎవ‌రి ద‌గ్గ‌రా సంపూర్ణ‌మైన జ‌వాబు ఉండ‌దు. అర్థం చేసుకుంటూ ముందుకు సాగ‌డ‌మే మార్గం అని నాకు మాతృత్వం నేర్పింది`` అని అంటారు ఆలియా. హాలీవుడ్ సినిమా షూటింగ్ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ర‌ణ్‌వీర్ సింగ్‌తో రాఖీ అవుర్ రాణీకీ ప్రేమ్ క‌హానీలో న‌టిస్తున్నారు. బ్ర‌హ్మాస్త్ర సీక్వెల్ రెడీ అవుతోంది. వార్‌లో ఎన్టీఆర్ ప‌క్కన ఆలియా క‌నిపిస్తార‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది.