English | Telugu

జ‌వాన్ లీక్డ్ క్లిప్స్‌ని తొల‌గించాల‌ని ఆదేశించిన హైకోర్టు

షారుఖ్ ఖాన్ హీరోగా న‌టిస్తున్న సినిమా జ‌వాన్‌. సౌత్ డైర‌క్ట‌ర్ అట్లీ డైర‌క్ట్ చేస్తున్నారు. న‌య‌న‌తార ఈ సినిమాతోనే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. కీ రోల్స్ లో విజ‌య్ సేతుప‌తి, ప్రియ‌మ‌ణి, దీపిక ప‌దుకోన్ న‌టిస్తున్నారు. సౌత్ నుంచి మరో టాప్ హీరో కూడా ఈ సినిమాలో న‌టిస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఈ సినిమాలోని కొన్ని క్లిప్స్ లీక్ అయ్యాయి. దీని గురించి ఢిల్లీ హైకోర్టు సోష‌ల్ మీడియాకు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. షేడీ వెబ్‌సైట్స్, కేబుల్ టీవీ ఔట్‌లెట్స్, డైర‌క్ట్ టు హోమ్ స‌ర్వీసులు జ‌వాన్ లీక్డ్ క్లిప్స్ ని డిలీట్ చేయాల‌ని చెప్పింది.

స‌ర్కులేట్ చేయొద్ద‌ని ఆదేశించింది. రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌, ఈ విష‌యం మీద ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది. షారుఖ్‌ఖాన్‌, ఆయ‌న భార్య గౌరీఖాన్ ఈ విష‌యం మీద లా సూట్ వేశారు. జ‌స్టిస్ సి.హ‌రిశంక‌ర్ ధ‌ర్మాస‌నం సోష‌ల్ మీడియా సైట్స్ కి కొన్ని సూచ‌న‌లు ఇచ్చింది. యూట్యూబ్‌, గూగుల్‌, ట్విట్ట‌ర్‌, రెడ్డిట్ లాంటి వాటిలో లీక్డ్ కంటెంట్‌ని వైర‌ల్ చేయొద్ద‌ని చెప్పింది. కాపీ రైట్ కంటెంట్ కింద చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది. చూడ‌టానికిగానీ, డౌన్‌లోడ్స్ కి గానీ అందుబాటులో ఉంచ‌కూడ‌ద‌ని తెలిపింది. జ‌వాన్‌కి సంబంధించి రెండు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. షారుఖ్ ఖాన్ ఫైట్ సీక్వెన్స్, డ్యాన్స్ సీక్వెన్స్ కి సంబంధించిన వీడియోల‌ని అంటున్నారు. ఆల్రెడీ ఈ ఏడాది ప‌ఠాన్ సినిమాతో స‌క్సెస్ సాధించారు షారుఖ్‌. ఇప్పుడు జ‌వాన్ విడుద‌ల చేయ‌డానికి క‌ష్ట‌ప‌డుతున్నారు.