English | Telugu
సైనికుల తల్లుల బాధ మీకు అర్ధమవుతుందా!
Updated : May 13, 2025
ఇటీవల పహల్ గామ్(PahalGaam)లో పాకిస్తాన్ కి చెందిన ఉగ్రవాదులు మన వాళ్ళని అన్యాయంగా చంపడంతో మన వాళ్ళు ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)ని నిర్వహించి కొంత మంది ఉగ్రవాదులని తుది ముట్టించడం జరిగింది. కానీ ఆ తర్వాత పాకిస్థాన్ మళ్ళీ కవ్వింపు చర్యలకి పాల్పడంతో దేశంలో యుద్ధవాతావరణం నెలకొంది. దీంతో సెలవుపై ఉన్న సైనికులకి ఆర్మీ నుంచి పిలుపు రావడంతో సైన్యంతో జాయిన్ అయ్యారు.
ఈ విషయంపై ఆర్ఆర్ఆర్ తో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt)సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు దేశంలో కొన్ని రోజుల నుంచి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రతి మాట, వార్త వెనుక టెన్షన్. ఆదివారం మదర్స్ డే ని చాలా ఘనంగా జరుపుకున్నాం. కానీ దేశ రక్షణ కోసం హీరోలని పెంచిన తల్లుల గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాను. ప్రతి సైనికుడి యూనిఫామ్ వెనక నిద్ర లేని ఎన్నో రాత్రుల్ని గడిపే అతని తల్లి ఉంటుంది. తన బిడ్డకి ఏ రాత్రి కూడా జోలపాటల ఉండదని ఆమెకి తెలుసు. ఒత్తిడి తో కూడిన ఆ నిశ్శబ్డం ఏ నిమిషమైన బద్దలు కావచ్చు. కానీ ప్రతి రాత్రి ఉద్రిక్తతలు లేని ప్రశాంతతని కోరుకుంటున్నాం. ఆ తల్లితండుల దైర్యం ఈ దేశాన్ని ఎంతగానో కదిలిస్తుంది. పంటి బిగువున బాధని నొక్కిపెట్టిన వారికి అండగా ఉంటు మా రక్షకుల కోసం, ఈ దేశం కోసం కలిసి నిలబడతామంటు ట్వీట్ చేసింది.
అగ్ర దర్శకుడుగా ఎన్నో హిట్ చిత్రాలని తెరకెక్కించిన మహేష్ భట్ కూతురు అయినటువంటి అలియాభట్ 2012 లో వచ్చిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' అనే మూవీతో తెరంగ్రేటం చేసింది. ఆ తర్వాత 'హైవే, టూస్టేట్స్, షాందార్, కపూర్ అండ్ సన్స్, డియర్ జిందగీ, కల్నక్, సడక్ 2 , బ్రహ్మాస్త్ర, డార్లింగ్, జీగ్రా, గంగు భాయ్ కథైవాడీ ఇలా ఇప్పటి వరకు సుమారు పాతిక సినిమాలకి పైనే చేసింది. 2022 లో ప్రముఖ హీరో రణబీర్ కపూర్ తో వివాహం జరిగింది.